• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎనర్జీ హీరోకి క్రేజీ...

ఎనర్జీ హీరోకి క్రేజీ రికార్డ్

By - Tupaki Desk
Update: 2017-06-17 05:20 GMT
ఈ మధ్య కాలంలో యంగ్ హీరో రామ్ కు మంచి బ్రేక్ నిచ్చిన సినిమా నేను.. శైలజ. వరస ఫ్లాపులతో రామ్ సతమతమవుతున్న సమయంలో సూపర్ హిట్ లభించింది. ప్రేమ - సెంటిమెంట్ మేళవింపుతో కిషోర్ తిరుమల స్టోరీ తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది. రామ్ కూడా ఈ సినిమాలో రొటీన్ స్టైల్ కు భిన్నంగా కనిపించడం ప్లస్సయ్యింది.  ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ స్టేటస్ కు చేరుకుంది.

నేను శైలజ సినిమాలో పాటలన్నీ మ్యూజికల్ హిట్టయ్యాయి. ఇప్పటికీ చాలామంది సెల్ ఫోన్లలో ఈ సినిమా పాటలు రింగ్ టోన్లుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని పాటల్లో క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇప్పుడో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. క్రేజీ క్రేజీ ఫీలింగ్ పాటను యూట్యూబ్ లో 3 కోట్ల మంది వీక్షించారు. తెలుగు పాటల్లో ఇదొక అరుదైన రికార్డని చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్ చెప్పారు. ఈ స్థాయి రికార్డు సాధించడం ఆనందంగా ఉందన్నారు.  కెరీర్ లో తనకు మంచి బ్రేక్ నిచ్చిన కిషోర్ తిరుమలతో మరో సినిమా చేస్తున్నాడు రామ్. పి.వి.ఆర్. సినిమాస్ తో కలిసి స్రవంతి మూవీస్ సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తోంది.

రామ్ లేటెస్ట్ సినిమా హైపర్ సినిమా నిరాశ పరచడంతో కిషోర్ తిరుమలతో చేస్తున్న సినిమాపైనే ఫోకస్ చేశాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ - మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేను శైలజతో సూపర్బ్ మ్యూజిక్ అందించిన దేవీశ్రీ ప్రసాద్  ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. సో.. మరోసారి ఈ టీం తమ మేజిక్ రిపీట్ చేయడానికి రెడీ అయిపోతుందన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Ram 
  • Hero Ram 
  • Nenu Sailaja Movie 
  • TElugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS