• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొరియర్ మళ్లీ లేటా?

కొరియర్ మళ్లీ లేటా?

By - Tupaki Desk
Update: 2015-09-06 09:54 GMT
ఇప్పటికే కొరియర్ డెలివరీ రెండేళ్లు ఆలస్యమైంది. అయ్యిందేదో అయ్యింది.. ఈ శుక్రవారం డెలివరీ ఖాయం అనుకుంటుంటే.. అంతలోనే ట్విస్టు అంటున్నారు. మళ్లీ వాయిదా అంటున్నారు. నితిన్ సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’కి ఈ శుక్రవారం కూడా మోక్షం కలిగే అవకాశం లేదంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సడెన్ గా రిలీజ్ డేట్ పోస్టర్ల ప్రింటింగ్ ఆపినట్లు సమాచారం. నిజంగానే వాయిదా పడుతుందా? పడేట్లయితే కారణాలేంటన్నది ఎవరూ చెప్పడం లేదు. మొన్నా మధ్య ఈ వారం విడుదల అని యాడ్స్ ఇచ్చినపుడే కొంచెం డౌటొచ్చింది. ఈ శుక్రవారం ఖాయం అన్నపుడు.. నేరుగా డేటివ్వొచ్చు కదా.. ఈ వారం విడుదల అని  సస్పెన్స్ ఏంటి అనుకున్నారు. కానీ ఇంతలోనే వాయిదా వార్తలు వినిపిస్తున్నాయి.

కొరియర్ బాయ్ కళ్యాణ్ డౌటనేసరికి తేజ సినిమా ‘హోరాహోరీ’ని హడావుడిగా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నితిన్ సినిమా ఉందనేసరికి పోటీ ఎందుకులే.. తర్వాతి వారం చూసుకుందాం అని ముందు కొంచెం ఆలోచనలో పడ్డారు. ఐతే ఇప్పుడు కొరియర్ బాయ్ సంగతి తెలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శుక్రవారం రిలీజ్ చేసేద్దామని చూస్తున్నారు. లేక లేక విడుదలవుతుందనుకుంటున్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ మళ్లీ వాయిదా పడుతోందంటే నితిన్ అభిమానులు నీరసించిపోవడం ఖాయం. రెండేళ్లు లేటైనా ట్రైలర్ చూస్తే ఫ్రెష్ గా ఉండటంతో సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. నిర్మాత గౌతమ్ మీనన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం వల్లే ఇన్నాళ్లు సినిమా లేటైంది. ఐతే ఆ వివాదాలన్నీ సమసిపోయినట్లే అనుకుంటుండగా ఈ కొత్త ట్విస్టేంటో అర్థం కావడం లేదు.
Tags:    
  • Nithin 
  • Courier Boy kalyan Movie 
  • Telugu NEws 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS