జాన్ అబ్ర‌హం దంప‌తుల‌కు క‌రోనా

Update: 2022-01-03 10:30 GMT
బాలీవుడ్ సెల‌బ్రిటీలు మ‌ళ్లీ క‌రోనా బారిన ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్ లో ఎక్కువ మందికి కోవిడ్ సోకింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ తాజాగా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే క‌పూర్ ఫ్యామిలీ స‌భ్యులకి కోవిడ్ సోకింది. ఆ విష‌యాన్ని క‌పూర్ ఫ్యామిలీ వెల్ల‌డిచింది. మ‌ళ్లీ అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా జాన్ అబ్ర‌హం దంప‌తులు కూడా వైర‌స్ బారిన ప‌డ్డారు. జాన్ తో పాటు ఆయ‌న స‌తీమ‌ని ప్రియారుంచ‌ల్ కి కోవిడ్ సోకింది. ఈ విష‌యాన్ని దంపతులు సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. మూడు రోజుల క్రితం మేము క‌లిసిన వ్య‌క్తికి కోవిడ్ సోకింద‌ని తెలిసింది.

దీంతో వెంట‌నే మేము కూడా ప‌రీక్ష‌లు చేసుకోగా పాజిటివ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఇద్ద‌రం హోమ్ ఐసోలేష‌న్ లో ఉన్నాం. రెండు డోసుల టీకా తీసుకున్న వైర‌స్ సోకింది. తేలిక‌పాటి ల‌క్ష‌ణాలున్నాయి. అంద‌రూ మాస్క్ లు ధ‌రించి జాగ్ర‌త్త‌గా ఉండండ‌ని సూచించారు. అలాగే `జెర్సీ` హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా వైర‌స్ బారిన ప‌డ్డారు. లోపాలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంది. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన వాళ్లంతా కోవిడ్ ప‌రీక్ష‌లు చేసుకోండ‌ని సూచించారు.

మొత్తానికి మ‌ళ్లీ కోవిడ్ క‌ల‌క‌లం మొద‌లైంది. అయితే వీళ్లంద‌రికీ సోకిన వైర‌స్ ర‌కం ఏంట‌న్న‌ది రివీల్ చేయ‌లేదు. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కాద‌ని..సాధార‌ణ పాత వైర‌స్ నే సోకిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భార‌త‌దేశంలో ఇదే ర‌కం వైర‌స్ బారిన చాలా మంది ప‌డుతున్నారు. ఓమిక్రాన్ విదేశాల నుంచి వ‌చ్చిన వారికి.. వారి ద్వారా ఇతరుల‌కు సోకుండా ప్ర‌భుత్వం త‌గు చ‌ర్య‌లు తీసుకుంటోంది. దీన్ని థ‌ర్డ్ వేవ్ గా ప్ర‌క‌టించి క‌ట్టుదిట్టంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.


Tags:    

Similar News