• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్‌ హాసన్‌ కి కరోనా...

కమల్‌ హాసన్‌ కి కరోనా పాజిటివ్ .. అభిమానుల కోసం ట్వీట్‌

By - Tupaki Desk
Update: 2021-11-22 10:45 GMT
కరోనా వైరస్ మహమ్మారి ఇంకా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఇప్పటికీ ఇంకా కరోనా మహమ్మారి, కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తమిళ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల తన సొంత క్లాత్‌ బ్రాండ్‌కు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమెరికా వెళ్లిన కమల్‌, తాజాగా తిరిగి భారత్‌ కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే లక్షణాలు కనిపించగానే వెంటనే అలర్ట్‌ అయిన కమల్‌.. పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. అభిమానులు , పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఎంఎన్ ఎం పార్టీ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే తన ఆరోగ్య పరిస్థితిపై కమల్‌ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. అమెరికా టూర్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత కాస్త దగ్గు వచ్చింది. దీనితో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ గా తేలింది. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాను. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ రాసుకొచ్చారు.

సోమవారం మధ్యాహ్యం కమల్ హాసన్ తాను హస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. యూ.ఎస్. ట్రిప్ నుండి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చిందని, పరీక్షలు నిర్వహించగా ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారని అన్నారు. కొవిడ్ కారణంగా ప్రస్తుతం హాస్పిటల్ లో ఐసొలేషన్ లో ఉన్నట్టు కమల్ హాసన్ ఆ ప్రకటనలో తెలిపారు. కమల్ హాసన్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టగానే, ఆయన త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను అభిమానులంతా వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం. మరిప్పుడు తమిళ బిగ్ బాస్ ను ఎవరు నిర్వహిస్తారనే సందేహాన్ని వ్యక్తం చేశారు.


Tags:    
  • Corona positive 
  • Kamal Haasan 
  • latestnews 
  • laterst updates 
  • trending news 
  • Newstoday 
  • Trend News 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS