'బిగ్ బి' ధైర్యానికి కరోనానే భయపడాలి

Update: 2021-05-08 23:30 GMT
ఓ ప్రక్కన దేశం మొత్తం కరోనాతో వణికిపోతోంది. టీవీ రియాల్టి షోలలో పాల్గొనటానికి జనం భయపడుతున్నారు. అందుకునే ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభం కావాల్సిన ఎవరు మీలో కోటీశ్వరులు షో కూడా వాయిదాపడిందని వార్తలు వస్తున్నాయి. అయితే అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షో మాత్రం ఆగేటట్లు లేదు. సోనీ టెలివిజన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంది సామన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.  ముఖ్యంగా ఈ షోలో సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారు సైతం తమ ప్రతిభతో లక్షలు గెలుచుకుంటూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.  ఈ షోలో పాల్గొనటం చాలా మందికి ఓ డ్రీమ్‌. అందుకే ఎన్నిఇబ్బందులు ఎదురైనా ఈ షోకు బ్రేక్‌ ఇవ్వటం లేదు ఆర్గనైజర్స్. కోవిడ్‌ సిచ్యుయేషన్‌లోనూ అన్ని జాగ్రత్తలతో షో కంటిన్యూ చేస్తామంటున్నారు.

వాస్తవానికి క్రితం సంవత్సరం కేబీసీ షూట్‌లోనే కరోనా బారిన పడ్డారు అమితాబ్‌ బచ్చన్‌…అయినా సరే తిరిగి కోలుకున్న తరువాత అన్ని జాగ్రత్తలతో షో  కంప్లీట్ చేశారు. కాకపోతే కోవిడ్ నేపథ్యంలో ఆడియన్స్‌ లేకుండా, సోషల్ డిస్టెన్స్‌ పాటిస్తూ షో నిర్వహించారు. లాస్ట్ సీజన్‌ సక్సెస్‌ కావటంతో ఈ ఇయర్‌ కూడా కొత్త సీజన్‌ను స్టార్ట్ చేయబోతున్నారు.   బిగ్ బి ఈ విపత్కర పరిస్దితుల్లో ఈ వయస్సులోనూ అన్ని ప్రోటోకాల్ లకు కట్టుబడి పని చేస్తున్నారు.

తాను ఇప్పుడు 13 వ సీజన్ తో ఛాలెంజ్ కి సిద్ధంగా ఉన్నానంటురు. నిర్వాహకులు కూడా చాలా జాగ్రత్తలతో ఈ షోని ప్లాన్ చేస్తున్నారు. క్రితం సంవత్సరం  ఇంప్లిమెంట్ చేసిన అన్ని కండిషన్స్‌ను కంటిన్యూ చేస్తూ 13th సీజన్‌ను స్టార్ట్ చేస్తున్నట్టుగా ఎనౌన్స్‌ చేశారు. మరోసారి అమితాబ్ హోస్ట్ చేస్తున్న ఈ షోకు సంబంధించిన రిజిస్టేషన్స్‌ మే 10 న ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్‌.  మరికొద్ది రోజుల్లోనే కేబీసీ ప్రేక్షకులను అలరించడానికి రానుంది.
Tags:    

Similar News