ఇదేందిదీ...! ఎక్కడా చూడాలేదు...! ఇదెక్కడైనా ఉందా...!
కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల మీద కోలుకొని దెబ్బ కొట్టింది. ఇక సినీరంగం మీద ఈ మహమ్మారి మాములు ఎఫెక్ట్ చూపించలేదు. సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. ట్రేడ్ వర్గాలు లెక్కించించడానికి వీల్లేని రేంజ్ కి ఈ కరోనా నష్టం చేరింది. ఈ సంక్షోభం నుండి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఎఫెక్ట్ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తోంది. లాక్ డౌన్ ఇంకొన్ని రోజులు పొడిగించినప్పటికీ రెడ్, గ్రీన్ జోన్, ఆరెంజ్ అని జోన్స్ ఏర్పాటు చేసి కొన్ని నిభందనలు సడలిస్తున్నారు. దీంతో మెల్లగా అయినా కొన్ని రోజుల్లో యధాస్థితికి వచ్చే అవకాశం ఉంది. థియేటర్స్ అప్పుడే తెరుచుకోకపోయినా కొన్ని షరతులతో షూటింగ్స్ కి అనుమతి దొరికే అవకాశం ఉంది. దీంతో కొత్త సినిమా షూటింగ్స్.. ఇప్పటికే కొంత చిత్రీకరణ జరుపుకున్న సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఒక నిర్ణయానికి వచ్చారట. మనకి వచ్చిన అత్యంత కీలకమైన ఇన్ఫర్మేషన్ ప్రకారం హీరో హీరోయిన్లు సీక్రెట్ గా ఫోన్ కాన్ఫరెన్సులు.. వీడియో మీటింగ్స్ చేసుకుంటున్నారని మనం ఇది వరకే చెప్పి ఉన్నాం.
అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ మధ్య వినిపిస్తున్న వార్తలను బట్టి కరోనా లాక్ డౌన్ తెరిచి షూటింగ్స్ ఎదావిధిగా స్టార్ట్ చేశాక కూడా సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరో హీరోయిన్ల వల్ల పరిస్థితులు సద్దుమణిగేలా లేవంట. కొందరు హీరోలు ఏంటి ఆల్ మోస్ట్ అంతా ఈ రూల్ పెట్టుకుంటున్నారని తెలసింది. హీరోలే కాదు హీరయిన్లు కూడా ఇదే రూల్ ని పాటించాలని డిసైడ్ అవుతున్నట్లుగా కాస్టింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకి ఆ రూల్ ఏంటంటే.. షూటింగ్ షట్ డౌన్ చేసే టైమ్ కి రిలీజ్ కి రెడీ ఉన్న సినిమాల్లో ఉన్న హీరోలు కరోనాకి వ్యాక్సిన్ వచ్చే వరకు.. లేదా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కరోనా జాడ కనిపించకపోతేనే ఆ తరువాత సినిమాలకు షూటింగ్స్ కి హాజరవుతారంట. ఇక షూటింగ్స్ ఆగిపోయి మధ్యలో ఉన్న సినిమాల్లో ఉన్న హీరోలు మాత్రం షూటింగ్ లో పాల్గొని ఆ సినిమాను పూర్తి చేయడానికి ఒప్పుకుంటారట. ప్రభుత్వం రెడ్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్స్ వలే నిబంధనలు పెట్టినట్లు హీరో హీరోయిన్లు కొత్తగా ఈ రూల్స్ పెడుతున్నారని కామెంట్స్ వస్తున్నాయి. మేకప్, హెయిర్ స్టైల్ తదితర విషయాల్లో చాలా దగ్గరగా సహాయకులతో వర్క్ చేయించుకోవాల్సి వస్తుంది.. దీంతో సోషల్ డిస్టెన్స్ పాటించడం కుదరదు. అందుకే యాక్టర్లు ఈ రూల్స్ పెట్టుకున్నారని అంటున్నారు. మరి రాబోయే రోజులో లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో చూడాలి.