#క‌రోనా: కుప్ప‌కూలిన‌‌ RRR బ్యూటీ క‌ల‌లు

Update: 2020-04-28 06:30 GMT
అవును..RRR బ్యూటీ క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి. ఎంతో శ్ర‌మించి ఒక్కో మెట్టు నిర్మించుకుంటూ వ‌స్తున్న కెరీర్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లాల‌నుకున్న టైమ్ లో త‌న డ్రీమ్ ఇక నెర‌వేరేలా లేదు. రాజీ-గ‌ల్లీ బోయ్స్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌తో త‌న స్థాయి ఎంతో పెరిగింది. ఇప్పుడు ఆ స్థాయిని ఆర్.ఆర్.ఆర్..  గంగూబాయి కతియావాడి లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల‌తో మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లాల‌ని క‌ల‌లు కంది. అయితే ఇంత‌లోనే క‌రోనా బాంబ్ అన్ని క‌ల‌ల్ని విధ్వంశం చేసింది. ఒక ర‌కంగా క‌ల‌ల్లో క‌ల్లోలం సృష్టించింది. ఇది ఒక్క ఆలియా స‌న్నివేశ‌మే కాదు. అంద‌రి స‌న్నివేశం ఇదే అయినా ఆలియా ప‌రిస్థితి వేరే.

అయితే ఆలియాకు మాత్రం ఇత‌రుల‌తో పోలిస్తే ఇంకా తీర‌ని న‌ష్టం అని చెప్పాల్సిందే. ఎందుకంటే 2019 లో ఆలియా పేరు దేశ‌విదేశాల్లో మార్మోగింది. రైజింగ్ స్టార్ గా ఎదురే లేని ప్ర‌తిభావ‌నిగా ప్ర‌పంచం గుర్తిస్తున్న రోజులివి. ఇలాంట‌ప్పుడు స‌రిగ్గా సౌత్ లోనూ త‌న ఇమేజ్ ని పెంచే ఆర్.ఆర్.ఆర్ ఛాన్స్ రావ‌డం.. సేమ్ టైమ్ త‌న డ్రీమ్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీతో ప‌ని చేసే అవ‌కాశం రావ‌డం ఇవ‌న్నీ ఒక క‌ల‌లా సాగిపోతుండ‌గానే ఏమిటో ఉన్న‌ట్టుండి కొవిడ్ 19 ఊహించ‌ని అతిథిలా వ‌చ్చి ప‌డింది. ఆ రెండు ప్రాజెక్టులు ఇప్పుడు ఏమ‌య్యాయో చూస్తున్న‌దే.

ఆర్.ఆర్.ఆర్ ఇప్ప‌టికే వాయిదా ప‌డింది. లాక్ డౌన్ పీరియ‌డ్ ముగిస్తే కానీ పూర్త‌వ్వ‌దు... స‌వ్యంగా రిలీజ్ కాదు. ఇది ఎన్నాళ్లు అన్న చ‌ర్చ అభిమానుల్ని ఆందోళ‌న‌కు గురి తీస్తోంది. ఈ మూవీతో సౌత్ లో గ్రాండ్ ఎంట్రీ కుదురుతుంద‌నుకున్న ఆలియాకి ఇది ఎంతో నిరాశ‌ను క‌లిగిస్తోంది. ఇక మ‌రోవైపు భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలోని భారీ పాన్ ఇండియా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ కి ఆరంభ‌మే ఇక్క‌ట్లు త‌ప్ప‌లేదు. ఈ చిత్రాన్ని 2019 డిసెంబర్ లో ప్రారంభించారు. అయితే కరోనావైరస్ సంక్షోభం కారణంగా చిత్రీకరణ ఆకస్మికంగా ఆగిపోయింది.  2020 సెప్టెంబర్ 11 విడుదల తేదీపై దృష్టి సారించినా ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇప్ప‌టికే భన్సాలీ టీమ్ చాలా ఎదురు చూసి చివ‌రికి సెట్ల‌ను ప‌డ‌గొట్టే ప‌నిలో ఉంద‌ని స‌మాచారం. నిజానికి క‌రోనా లాక్ డౌన్ ఒక‌ట్రెండు నెల‌ల్లో ముగిస్తే తిరిగి చిత్రీక‌ర‌ణ మొద‌లు పెట్టేయొచ్చ‌ని భ‌న్సాలీ అండ్ టీమ్ భావించారు. కానీ క‌రోనా క్రైసిస్ ఎప్ప‌టికి ఎండ్ అవుతుందో తెలీని స‌న్నివేశం నెల‌కొంది. ముంబై అల్ల‌క‌ల్లోలంగా ఉంది. మృత్యుఘోష‌తో ప‌రిస్థితి అదుపు త‌ప్పింది అక్క‌డ‌.

మార్చి వ‌ర‌కూ భన్సాలీ టీమ్ ఎంతో ఓపిగ్గా ఎదురు చూసి సెట్ నిర్వహణ కోసం చెల్లింపుల్ని క్లియర్ చేసింది. షట్ డౌన్ ప్రకటించినప్పుడు కూడా... షెడ్యూల్ ఒక నెల లేదా అంతకన్నా ఆలస్యమైనా భ‌రించాల‌నే అనుకున్నారు. తాజా స‌న్నివేశం దృష్ట్యా సెట్ మెయింటెనెన్స్.. ఫిలింసిటీ చెల్లింపుల్ని భ‌రించ‌లేమ‌ని భ‌న్సాలీ అండ్ టీమ్ భావించార‌ట‌. ప్ర‌స్తుత‌ అనిశ్చిత పరిస్థితులలో నిలబెట్ట‌డం కంటే ఈ సెట్‌ను పున‌ర్మించ‌డ‌మే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని తేలింది. ఎందుకంటే ఫిల్మ్ సిటీకి చెల్లించాల్సిన రోజువారీ అద్దె బాగా ఎక్కువ కాబ‌ట్టి .. సెట్ ని నేలమట్టం చేస్తేనే మేల‌ని భావించార‌ట‌. అలా భ‌న్సాలీతో ప్రాజెక్టు ఇప్ప‌ట్లో ఉంటుందా ఉండ‌దా? అన్న ప‌రిస్థితి ఆలియాకి మింగుడు ప‌డ‌నిదిగా మారింది. రెండు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇలా అవ్వ‌డంతో అది త‌ట్టుకో లేక‌పోతోంద‌ట‌.
Tags:    

Similar News