కరోనా దెబ్బకి థియేటర్లలో భారీ మార్పులు..

Update: 2020-04-07 21:32 GMT
కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ ప్రాణ భయంతో వణికి చస్తున్నాయి. ఎప్పుడు ఎవరి ప్రాణం హరిస్తుందో అని ప్రజలంతా బెంబేలెత్తి పోతున్నారు. లాక్‌ డౌన్ ప్రకటించి దేశదేశాల మధ్య రాకపోకలు బంద్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వాక్సిన్ లేని ఈ మహమ్మారి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ పడిపోతుంది. వైరస్ ఎఫెక్ట్‌ తో ఇప్పుడు ప్రజలందరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా పలకరించుకోలేని పరిస్థితి దారుణం. ఇక ఇండియన్ సినీ పరిశ్రమల విషయానికి వస్తే వైరస్ ప్రభావం జోరుమీదే ఉంది. షూటింగ్స్ లేక ఎందరో సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ లాక్‌డౌన్ ఎప్పుడెప్పుడు ముగుస్తోందా? ఎప్పుడు షూటింగ్స్ మొదలవుతాయా? అని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న లాక్‌ డౌన్ కారణంగా సినిమాలు థియేటర్లలోకి వచ్చేదెప్పుడో గాని మల్టీఫ్లెక్స్ థియేటర్స్ యాజమాన్యం మాత్రం థియేటర్స్ విషయంలో కీలకమైన మార్పులు చేయాలనీ పూనుకున్నాయట. ఇకనుండి మల్టీప్లెక్స్ థియేటర్ల సీట్ల మధ్య గ్యాప్ పెంచాలని అనుకుంటున్నాయట. 500 సీట్లు ఉండే థియేటర్లో కేవలం 150 సీట్లకు కుదించి ఫేస్ మాస్కులు కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక సినిమా ముగిసిన తర్వాత థియేటర్ అంతా శానిటైజర్ స్ప్రే చేయనున్నట్లు కీలక నిర్ణయానికి వచ్చాయట. చూడాలి మరి కరోనా మహమ్మారి జీవన విధానంలోనే అన్నీ రంగాలలో అన్నీ విధమైన మార్పులకు దారి తీస్తుంది.
Tags:    

Similar News