స్టార్ హీరోయిన్ పాన్ ఇండియా ప్లాన్స్ కి క‌రోనా చెక్

Update: 2020-11-24 14:00 GMT
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ మ‌రోవైపు సొంత ప్రొడ‌క్ష‌న్ లో సినిమాలు నిర్మిస్తూ స‌ద‌రు స్టార్ హీరోయిన్ వేస్తున్న ప్లాన్స్ ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఇప్ప‌టికే ఓంరౌత్ ప్లాన్ చేసిన‌ సౌత్ క్రేజీ వెంచ‌ర్ ఆదిపురుష్ 3డి కి స‌ద‌రు బ్యూటీ సంత‌కం చేసింది. ఏకంగా బాహుబ‌లి స్టార్ ప్రభాస్ స‌ర‌స‌న న‌టించే ఆఫ‌ర్ అందుకుంది. ఇంత‌కీ ఈ భామ ఎవ‌రో క‌నిపెట్టేయ‌డం ఈజీనే. ది గ్రేట్ ప‌ద్మావ‌త్ ఫేం ది గ్రేట్ దీపిక పదుకొనే గురించే ఇదంతా.

ఇటీవ‌ల దీపిక వేస్తున్న ప్ర‌తి ప్లాన్ కి క‌రోనా చెక్ పెట్టేస్తోంద‌న్న గుస‌గుస వినిపిస్తోంది. 2019-20 సీజ‌న్ లో భారీ ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగాల‌నుకుంటే ఉన్న‌ట్టుండి క‌రోనా చెక్ పెట్టేసింది. నిర్మాత‌గా ఇప్ప‌టికే భారీ పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లి తెర‌కెక్కించిన ఓ రెండు సినిమాలు ఇబ్బందిక‌ర ప‌రిణామాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒక‌టి ఇప్ప‌టికే రిలీజై ఫ్లాపైంది. మరొక‌టి క‌రోనా క్రైసిస్ వ‌ల్ల థియేట‌ర్లు తెర‌వ‌క రిలీజ్ కాలేదు. అదే పాన్ ఇండియా మూవీ 83. హ‌బ్బీ ర‌ణ‌వీర్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడి(క‌పిల్ దేవ్‌)గా న‌టిస్తే తాను అత‌డు స‌తీమ‌ణి పాత్ర‌ను పోషించింది. టీమిండియా 1983 విక్ట‌రీ నేప‌థ్యంలో క‌థాంశంతో ఈ మూవీ తెర‌కెక్కింది.

తాజాగా కింగ్ ఖాన్ షారూక్ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ప‌ఠాన్ లోనూ దీపిక ఆఫ‌ర్ ద‌క్కించుకుంది. పఠాన్ ‌లో దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్ తో క‌లిసి ప‌ని చేసే ఏజెంట్ గా క‌నిపించ‌నుంద‌ట‌. ఇందులో భారీ యాక్షన్ తో అద‌ర‌గొట్ట‌నుంద‌ట‌. YRF సంస్థ‌ ప్రతిష్టాత్మకంగా 50 సంవత్సరాలు పూర్త‌యిన సంద‌ర్భంగా `పఠాన్`ని ప్లాన్ చేసింది. దీనికి వార్ దర్శకుడు సిధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇందులో జాన్ అబ్ర‌హాం విల‌న్ పాత్ర‌లో క‌నిపిస్తారు. నవంబర్ ప్రారంభంలో SRK స్పోర్టింగ్ ఎడ్జీ లుక్ తో షూటింగ్ ప్రారంభమైంది.

ఇప్పుడు, ఈ చిత్రంలో ఏజెంట్ పాత్రను దీపికా పదుకొనే రాయనున్నట్లు తెలిసింది. దినపత్రిక ప్రకారం, సోమవారం, దీపిక రెండు రోజుల షూట్ కోసం జట్టులో చేరింది. ఈ సినిమాకు, షకున్ బాత్రాకి మధ్య ఆమె గారడీ చేస్తోంది. ఆమె డిసెంబర్ మధ్యలో SRK లో చేరడానికి సిద్ధంగా ఉంది మరియు 2021 జనవరి మరియు జూన్ మధ్య ప్రధాన యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్సులు చిత్రీకరించబడతాయి.

దీపిక పాత్రకు సంబంధించినంతవరకు చూస్తే తాను తొలిసారి ఒక రా ఏజెంట్ పాత్ర‌ను పోషిస్తోంది. అది పఠాన్ లోని  ఒక మిషన్ లో పాల్గొనే డేరింగ్ గాళ్ పాత్ర‌. టైగర్ జిందా హై ఫ్రాంచైజీ నుండి కత్రినా కైఫ్ జోయా తరహాలో ఇది యాక్ష‌న్ మిక్స్ డ్ గా ఉంటుంద‌ట‌. పఠాన్ లో ఎస్.‌ఆర్.‌కె పాత్ర‌ను `టైగ‌ర్ జిందా హై`లో స‌ల్మాన్ పాత్ర‌తో పోలుస్తున్నారు.
Tags:    

Similar News