కల్కి వివాదం కొలిక్కి వచ్చినట్టేనా

Update: 2019-06-22 06:10 GMT
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి వచ్చే వారం 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథ తనదంటూ 2009లోనే రిజిస్టర్ చేసుకున్నానని కార్తికేయ అనే దర్శకుడు కం రచయిత ఆరోపించడంతో వివాదం మొదలై నిన్న దీని గురించి ఫిలిం నగర్ లో పెద్ద చర్చే జరిగింది. అయితే రచయితల సంఘం తరహాలో ఇలాంటి వ్యవహారాలు చూసే కథా హక్కుల వేదిక తరఫున బివిఎస్ రవి ఓ ప్రకటన జారీ చేస్తూ కల్కికి గతంలో కార్తికేయ రిజిస్టర్ చేసుకున్న కథకు పోలికలు లేవని దీన్ని ఇంతటితో ముగింపు పలుకుతున్నామని చెప్పాడు.

తమ వేదికకు చట్టబద్దత లేని కారణంగా ఒకవేళ సదరు రచయిత న్యాయం జరగలేదు అనుకుంటే కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఇది సద్దుమణిగినట్టే అనిపిస్తోంది. ఒకవేళ కార్తికేయ కనక ఈ మ్యాటర్ ను సీరియస్ గా తీసుకుంటే లీగల్ గా వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు. చేతిలో ఇంకో ఆరు రోజులు సమయం మాత్రమే ఉంది. ఒక్క రోజు ముందు వరకు ఇలాంటి వ్యవహారాలు కోర్టులలో జరుగుతూ ఉంటాయి కాబట్టి గురువారం దాకా టైం ఉందని అనుకోవచ్చు.

కార్తికేయ అంత బలంగా ఒకవైపు తన వెర్షన్ వినిపిస్తుంటే కథ హక్కుల వేదిక దానికి భిన్నమైన సమాధానం చెప్పడం గమనార్హం ఇప్పటికీ దర్శక నిర్మాతలు హీరో కాని ఎవరూ స్పందించలేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన కల్కి 80వ దశకంలో జరిగిన క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందినట్టుగా సమాచారం. భారీ ఎత్తున విడుదలకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగిపోయాయి

    

Tags:    

Similar News