మహేష్ కథ కూడా కాపీనా?

Update: 2018-01-19 23:30 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం వస్తోన్న చాలా రూమర్స్ హీరోలను బయపెడుతున్నాయి అనే టాక్ బాగా వినిపిస్తోంది. దర్శకులు తీసుకువచ్చే కథకు బాగా ఇంప్రెస్స్ అయ్యి ఒకే చేస్తున్నారు గాని ఆ తరువాత కాపీ అని నిందలు పడుతుండడంతో తట్టుకోలేకపోతున్నారు. అసలు ఆ కథ దర్శకులదేనా అనే అనుమానాలు చాలా కలుగుతున్నాయి. మిగతా ఇండస్ట్రీలోని హీరోలు కూడా అదే తరహాలో ఇప్పుడు అనుమానిస్తున్నారు. రీసెంట్ గా ఫ్రెంచ్ మూవీ ఆధారంగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమానే అందుకు ఉదాహరణ. దర్శకుడు త్రివిక్రమ్ రిలీజ్ టైమ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇప్పుడు మహేష్ సినిమాపై కూడా చాలా రూమర్స్ వస్తున్నాయి. మహేష్ కెరీర్లో ఎప్పుడు లేని విధంగా ఒక హాలీవుడ్ ఆధారంగా తెరకెక్కిన కథలో నటిస్తున్నాడు అని టాక్ వినిపిస్తోంది. ఆ కథ మరేదో కాదు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న భరత్ అనే నేను కథనే. కొరటాల మొదటి సారి ఒక రచయిత రాసిన కథకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీహరి నాను అనే రచయిత నుంచి కొరటాల భరత్ అనే నేను కథని తీసుకున్నాడు. అయితే అతను 90 లలో వచ్చిన ఒక హాలీవుడ్ కథ ఆధారంగా ఈ కథను అల్లినట్లు ఫిల్మ్ నగర్ లో రూమర్స్ వస్తున్నాయి.

అయితే స్క్రీన్ ప్లే నూ మార్చకుండా చివరి నిమిషంలో త్రివిక్రమ్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడో కొరటాల కూడా అదే తరహా స్క్రీన్ ప్లే తో వస్తే కొంచెం కష్టమే అనే విధంగా టాక్ వినిపిస్తోంది. ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీమంతుడు తరువాత వస్తుండడంతో బిజినెస్ ఓ రేంజ్ లో ఉంటుందని అందరూ అనుకుంటున్నారు కానీ అజ్ఞాతవాసి లనే ఈ సినిమాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుందా అని ఓ వర్గం వారు చర్చించుకుంటున్నారు. మరి ఎలాంటి పరిణామాలు ఎదురావుతాయో చూడాలి.
Tags:    

Similar News