• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమ్మరాజ్యంలో కడపరెడ్లు...

కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాని ఆపేయండి..వర్మ కి షాక్

By - Tupaki Desk
Update: 2019-10-28 12:33 GMT
రామ్ గోపాల్ వర్మ నిత్యం వివాదాలతో స్నేహం చేసే వ్యక్తి. వర్మ ఏదైనా ఒక సినిమా చేయాలి అంటే అది ఎదో ఒక వివాదంతోనే మొదలుకావాలి. ఈ వివాదమే వర్మ సినిమాలకి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది. అందుకే వర్మ సినిమాలకి పెద్దగా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ మద్యే వర్మ డైరెక్షన్ లో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకి ముందు ఇన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందో అందరికి తెలిసిందే. కానీ , సినిమాపై ఇన్ని వివాదాలు ఉన్నప్పటికీ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఇక వర్మ తాజా చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు. దీనికి సంబంధించి తాజాగా దీపావళి కానుకగా  ట్రైలర్‌ ను కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఈ సమయంలో ఈ సినిమా పై ఒక వివాదం మొదలైంది. సినిమా టైటిల్ - కథపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అనంతపురం టూటౌన్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి - రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగరాజు ఫిర్యాదు చేశారు.

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్‌ను నిషేధించాలని - సినిమా విడుదలను అడ్డుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. డైరెక్టర్  రామ్ గోపాల్ వర్మ కులాల మధ్య గొడవలు సృష్టిస్తూ.. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సినిమా టైటిల్ పెట్టారని - అతనిపై కులాలను రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు గాను చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి - ముఖ్యమంత్రి - ప్రజాప్రతినిధులను ప్రజాస్వామ్యయుతంగా - రాజ్యాంగబద్ధంగా ఎన్నుకుంటారని - కులాల పేరిట కాదని లేఖలో వెల్లడించారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరింది.ఈ వివాదం పై వర్మ ఏ విధంగా స్పందిస్తారో మరి...
Tags:    
  • Ram Gopal Varma 
  • Kamma Rajyam Lo Kadapa Reddlu 
  • Telugu News 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS