బాహుబలి2పై కంప్లెయింట్!!

Update: 2017-04-25 07:37 GMT
బాహుబలి ది కంక్లూజన్ మూవీ జనాల్లో బోలెడంత ఆతృత ఉంది. మూవీని రాజమౌళి ఎంత గొప్పగా తీశాడో అనే ఆసక్తి కంటే.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అందరికంటే ముందే తెలుసుకుందా అనే ఉత్సుకత ఎక్కువగా కనిపిస్తోంది. జనాల్లో ఉన్న ఈ క్యూరియాసిటీని క్యాష్ చేసుకునేందుకు బాహుబలి మేకర్స్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తూ.. ఇప్పటికే కొన్నిటిలో సక్సెస్ అయ్యారు కూడా.

ఏపీలో బాహుబలి2 మూవీని రోజుకు 6 ఆటలు ప్రదర్శించేందుకు పర్మిషన్ తెచ్చుకున్నారు. రాత్రి 2.30కి చివరి ఆట పూర్తయిపోవాలని చెప్పారు. అయితే బాహుబలి2కి ఇలా అనుమతులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం అంటూ.. ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై.. రాష్ట్ర హోం సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన అనూరాధకు.. తెలుగు సినిమా ఆడియన్స్ అసోసియేషన్ తరఫున ఫిర్యాదు అందింది. బాహుబలి2కి ఇచ్చిన అనుమతులను వెనక్కు తీసుకోవాలని వారు కోరారు.

రాత్రి 1 గంట నుంచి ఉదయం 8 గంటల వరకూ ఏ థియేటర్ లోను షోస్ వేయకూడదని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని వారు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతామని ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇవ్వడంతో.. ఇప్పుడు బాహుబలి2 షోస్ మరోసారి సందిగ్ధత కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News