ఎత్తులో వ‌రుణ్ తేజ్ మావ‌య్య‌కే పోటీనా..!

Update: 2021-07-09 03:30 GMT
మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ లు లేక‌పోతే ఇంట్లోనే ఎక్కువ స‌మ‌యం గడుపుతారు. విదేశీ ప్ర‌యాణాలు..టూర్లు.. వినోద‌యాత్ర‌లు అంటూ పెద్ద‌ బాస్ పెద్ద‌గా బ‌య‌ట తిర‌గ‌రు. ఆయ‌న ప్ర‌ప‌చ‌మంతా ఇల్లే. స‌మ‌యం దొరికినా..దొర‌క‌క‌పోయినా ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తోనే  ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఇక ఆ స‌మ‌యంలో చిరంజీవి త‌న వార‌సులు.. మ‌న‌వ‌లు.. మ‌న‌వ‌రాళ్ల‌తోనే గ‌డుపుతారు. కుమార్తెల‌  బిడ్డ‌ల‌తోనే ఎక్కువ‌గా టైమ్ స్పెండ్ చేస్తుంటారు.

అంద‌రికీ క‌న్నా చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెద్ద కుమార్తె నివృతి తో తాత‌య్య‌కు అనుబంధం కాస్త ఎక్కువే. నివృతి ఇప్పుడు టీనేజ్ లోకి అడుగుపెట్టింది. త‌న‌కు 13 ఏళ్లు.  ఇటీవ‌లే నివృతి పుట్టిన రోజు వేడుక‌లు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో నివృతిని చూసిన వాళ్లంతా మెగా ఫ్యామిలీలో హీరోలంద‌రి హైట్ ని మించిపోయేలా  ఉంద‌ని అనుకున్నారు. నివృతి హైట్ ఇప్పుడు త‌ల్లి శ్రీజ‌ని మించిపోయింది. 13 ఏళ్ల వ‌య‌సులోనే ఇంత హైట్ ఉందంటే 20 ఏళ్ల వ‌య‌సుకు వ‌చ్చేస‌రికి మెగా ఫ్యామిలీలో అంద‌రికి హైట్ ని క్రాస్ చేయ‌డం ఖాయమ‌ని అంటున్నారు.

ఆ ఫ్యామిలీలో నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ అంద‌రిక‌న్నా హైట్. ఇంకా ఎదిగే వ‌య‌సు చాలానే ఉంది కాబ‌ట్టి నివృతి మావ‌య్య ఎత్తుని కూడా క్రాస్ చేస్తూదంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. శ్రీజ‌-క‌ళ్యాణ్ దేవ్ జంట‌కు మ‌రో కుమార్తె జ‌న్మించిన‌ సంగ‌తి తెలిసిందే. మెగా ఫ్యామిలీలో వ‌రుణ్ తేజ్ ని మించిన ఎత్తుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ వార‌సుడు అకీరా నంద‌న్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. శ్రీ‌జ కుమార్తె నివృతి కూడా ఈ స్పెష‌ల్ ఓపీఎస్ టీమ్ లోనే చేరుతుంద‌న్న‌మాట‌.
Tags:    

Similar News