• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  `బెల్ బాట‌మ్`తో `ట‌క్...

`బెల్ బాట‌మ్`తో `ట‌క్ జ‌గ‌దీష్` పోలికేమిటి?

By - Tupaki Desk
Update: 2021-09-13 13:33 GMT
బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `బెల్ బాట‌మ్` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా క‌రోనా సెకెండ్ త‌గ్గుముఖం ప‌ట్టిన త‌రుణంలో హీరోలు నేరుగా థియేట‌ర్లోకి రావ‌డానికి సంకోచిస్తోన్న స‌మ‌యంలో అక్ష‌య్ బెల్ బాట‌మ్ డేర్ చేసి థియేట‌ర్లో రిలీజ్ చేశారు. కానీ సినిమా కు కొన్ని పాజిటివ్ రివ్యూలున్నా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్ రాలేదు. తొలి రోజే జ‌నం లేక‌ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. కొన్ని మిక్స్ డ్ రివ్యూలు వ‌చ్చాయి. దీంతో వ‌సూళ్లు అంత‌కంత‌కు ప‌డిపోయాయి. అస‌లే క‌రోనా దెబ్బ‌కు జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. దీంతో అక్ష‌య్ కెరీర్ లోనే లీస్ట్ వ‌సూళ్లు తెచ్చిన తొలి చిత్రంగా నిలిచిపోయింది.

ఆ ర‌కంగా థియేట‌ర్లో రిలీజ్ అయి `బెల్ బాట‌మ్` దెబ్బ అయిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబ‌ర్ 16 నుంచి స్ర్టీమింగ్ అవ్వ‌డానికి రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఓటీటీ  ప్రేక్ష‌కులు చూడ‌టానికి ఎంత మాత్రం ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని టాక్ వినిపిస్తోంది. ఆడియ‌న్స్ సినిమాపై ఎంత మాత్రం ఎగ్జైట్ మెంట్ చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది. థియేట‌ర్ రిలీజ్ తో నెగిటివ్ టాక్ రావ‌డంతో ఓటీటీలో ఇలా  రిలీజ్ కి ముందే చ‌తికిల ప‌డిపోయింది. ముందుగా థియేట‌ర్లో రిలీజ్ అయి..అక్క‌డ తేడా కొట్టి ఓటీటీలోకి వ‌స్తే ఏ సినిమాకైనా ఇదే ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. ఈ నేప‌థ్యంలో `బెల్ బాట‌మ్` ని  ఓ గుణ‌పాఠంగా చెప్పొచ్చు.

ఇదే సినిమా ముందుగా ఓటీటీలో రిలీజ్ అయి ఉంటే క‌నీసం సినిమా  కొంత  ప్రాఫిట్ తోనైనా సేఫ్ జోన్ లో ఉండేది. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు. చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకుంటే సుఖ‌మేమి అన్న చందంగా త‌యారైంది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ నిర్మాత‌లు ఇప్పుడున్న ప‌రిస్థితుల్ని బేరీజు వేసుకుని..సినిమా ఔట్ పుట్ ని నిశితంగా ప‌రిశీలించి  థియేట‌ర్ క‌న్నా ముందుగానే ఓటీటీకి వెళ్లిపోతేనే బెట‌ర్ అనే ఛాయిస్ ని తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన  `ట‌క్ జ‌గ‌దీష్` రిలీజ్ విష‌యంలో త‌లెత్తిన హైడ్రామా గురించి తెలిసిందే. థియేట‌ర్ రిలీజ్  నా? ఓటీటీ రిలీజ్ నా? అన్న సందేహం న‌డుమ ముందుగా  ఓటీటీలోనే రిలీజ్ అయి సేఫ్ జోన్ లో ప‌డింది. లేదంటే `ట‌క్ జ‌గ‌దీష్`  కూడా  మ‌రో `బెల్ బాట‌మ్` అయ్యేది. 
Tags:    
  • tuck jagadish 
  • Nani tuck jagadish 
  • tuck jagadish on prime 
  • tuck jagadish streaming 
  • tuck jagadish talk 
  • bell bottom 
  • bell bottom movie 
  • akshay kumar 

Similar News

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

Copyright @2026

Powered by Blink CMS