• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యాక్టరే కాదు.. మంచి...

యాక్టరే కాదు.. మంచి డాక్టర్ కూడా

By - Tupaki Desk
Update: 2017-10-22 01:30 GMT
నవ్వండి - నవ్వించండి... నవ్వు ఆరోగ్యకరం అని అహ నా పెళ్ళంట సినిమా ద్వారా జంధ్యాల గారు మనకు మంచి సందేశాన్ని ఇచ్చారనే చెప్పాలి.  నవ్వడం ఒక భోగాం.. నవ్వకపోవడం ఒక రోగం అని పెద్దలు కూడా చెబుతూనే ఉంటారు. ఈ రోజుల్లో మనల్ని చాలా మంది కమెడియన్లు వారి నటనతో నవ్విస్తున్నారు. అల్లు రామలింగయ్య దగ్గర నుంచి బ్రహ్మానందం వరకు అనేకమంది కమెడియన్స్ టాలీవుడ్ లో పుట్టుకొచ్చారు. ప్రస్తుతం యువ కమెడియన్లు కూడా మంచి టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో భద్రం కూడా ఒకడు.

రీసెంట్ గా వచ్చిన మహానుభావుడు సినిమాలో నాజర్ పక్కన తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో జిడ్డేశ్‌ పాత్రలో అందరిని నవ్వించాడు. ముఖ్యంగా 'అల్లుడు గారు మామూలుగా లేరండీ..’ - ‘అల్లుడు గారికి సరసం బాగా ఎక్కువండీ బాబూ..’ అనే డైలాగులు చాలా పాపులర్ అయ్యాయి. ఇతన్ని చూస్తే ఎవ్వరైనా ఎంత కష్టపడి నటుడు అయ్యాడో.. ఫిల్మ్ నగర్ లో ఎన్ని బాధలు పడ్డాడో అనుకుంటారు. కానీ మనోడి జాబ్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. హైదరాబాద్ లో ఎర్గొనోమిక్స్‌ డాక్టర్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వృత్తిపరంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలకు ఫీజియోథెరపీ చేసేవాడు. అదికూడా బెంగుళూరులో అభ్యసించి వచ్చాడు. నిజంగా అతని బాష - నటన తీరును చూస్తే నమ్మబుద్ది కాదు కదా ఇది నిజం. నవ్వించేవాడిని డాక్టర్ తో పోలుస్తారు. భద్రం డాక్టర్ గా జీవితాన్ని ఆరంభించి యాక్టర్ గా జీవితాన్ని కొనసాగించడం దేవుడిచ్చిన వరమని అంటున్నాడు.  

ఈ భద్రం గురించి ఇంకా చెప్పాలంటే.. మొదట స్నేహితుని సలహాతో మనోడు లవ్ పెయిన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మంచి గుర్తింపు పొందాడు, ఆ తర్వాత సన్నిహితుల సహాయంతో మ్యాంగో కంపెనీకి బాగా దగ్గరయ్యాడు. అక్కడ పెళ్లితో జరభద్రం అనే మరో షార్ట్ ఫిల్మ్ ను తీసి ఈ స్థాయి ప్రముఖ దర్శకుల దృష్టిలో పడ్డాడు. ముఖ్యంగా పూరి జగన్నాథ్ ఆ షార్ట్ ఫిల్మ్ ను చూసి. ఇలాంటి నటులే ఇండస్ట్రీకి కావాలని ఆయన కలవమని చెప్పడంతో మొదటి సారి ఆయన సినిమాలో అవకాశం దక్కింది. జ్యోతిలక్ష్మి సినిమాలో బ్రోకర్ భద్రం గా మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత కూడా మారుతీ గారు బలే బలే మగాడివోయ్ సినిమాలో అవకాశం ఇవ్వగా ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కాయి. శతమానం భవతి - లోఫర్ - మొన్నటి మహానుభావుడు వంటి సినిమాల్లోని పాత్రలు చాలా బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పటివరకు భద్రం దాదాపు 50 సినిమాల్లో నటించాడు.
Tags:    
  • Comedian Badram 
  • Tollywood Journey 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS