• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'కోల్డ్‌ కేస్‌' ట్రైలర్:...

'కోల్డ్‌ కేస్‌' ట్రైలర్: ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మిస్టరీ థ్రిల్లర్‌..!

By - Tupaki Desk
Update: 2021-06-21 11:30 GMT
మలయాళ సినీ ఇండస్ట్రీ కంటెంట్ బేస్డ్ సినిమాలకు.. వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ గా నిలుస్తోంది. ఓటీటీల పుణ్యమాని ఈ సినిమాలు అన్ని భాషల వారికి చేరుతున్నాయి. ఈ మధ్య కాలంలో మాలీవుడ్ నుంచి వచ్చిన చాలా మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. కొన్ని సినిమాలు తెలుగులో డబ్‌ కాబడి.. మరికొన్ని చిత్రాలు ఓటీటీలో విడుదలవుతూ ఇక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ ''కోల్డ్‌ కేస్‌'' అనే మిస్టరీ థ్రిల్లర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు రెడీ అయింది. జూన్‌ 30న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ''కోల్డ్‌ కేస్‌'' విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ మంచి స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఓ మిస్టరీ మర్డర్ కేసును చేధించే పోలీస్ ఆఫీసర్ గా పృథ్వీరాజ్‌ కనిపిస్తున్నారు. 'అరువి' ఫేమ్ అదితి బాలన్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తోంది.

ఇందులో ఒక బ్రిలియంట్ కిల్లర్ ని పట్టుకునే క్రమంలో కొన్ని సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా చూపించడంతో మరింత ఆసక్తికరంగా మారింది. 'కొన్ని రహస్యాలు ఎప్పటికీ ఖననం చేయబడవు' అంటూ చెప్పబడిన ''కోల్డ్‌ కేస్‌'' ట్రైలర్ అద్భుతంగా ఉండి, సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. బ్యాగ్రౌండ్ స్కోర్ - విజువల్స్ దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియ - ఆత్మీయ - అలెన్సియర్ లోపేజ్ - అనిల్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ తనూ బాలక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'కోల్డ్ కేస్' ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

Full View   
Tags:    
  • malik 
  • cold case 
  • Bollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

చిరు 'లీక్స్' కాదు.. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అవసరం!

2026-11-07 06:50 GMT

43 ఏళ్లలో కూడా తరగని అందం.. నెట్ సారీలో త్రిష అందాలు!

2026-11-07 06:47 GMT

Tupaki Exclusive : నాగార్జున ఎందుకు ప్రెజెంట్ చేశారు? అనీష్ ఓపెన్ చాట్

2026-11-07 06:12 GMT

Copyright @2026

Powered by Blink CMS