బాహుబలి సెట్లో ఫేక్ సూర్యుడు
హైద్రాబాద్ తో పాటు పరిసర ప్రాంతాలన్నీ వర్షంతో తడిసి ముద్దవుతున్నాయి. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి అని వాతావరణ శాఖ చెప్పేసింది. ఈ ప్రభావం సినిమాలపై గట్టిగానే పడుతుందని తెలిసిందే. ఈ వర్షాలతో అన్నిటికంటే పెద్ద సమస్య.. లైటింగ్ (వెలుతురు) ఉండకపోవడమే.
బాహుబలి2 క్లైమాక్స్ షూటింగ్ కోసం రామోజీ ఫిలింసిటీలో పెద్ద పెద్ద సెట్స్ వేసేసుకుని పిక్చరైజేషన్ చేస్తున్న యూనిట్ కి.. ఈ వర్షం బ్రేక్ వేసే పరిస్థితి తీసుకొచ్చింది. కానీ అక్కడున్న టీమ్ మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ కాదు. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఎంతటి మొండివాడో తెలిసిందే. అందుకే ఓ 100కేవీ ఫ్లడ్ లైట్స్ పట్టుకొచ్చి లైటింగ్ ఏర్పాటు చేసి సీన్స్ తీసేస్తున్నారు. అంటే ఒక ఫేక్ సూర్యుడినే క్రియేట్ చేశారనమాట. ఇంతగా పట్టుదల ఉండబట్టే బాహుబలిని ఆ టీమ్ అంత పెద్ద హిట్ చేయగలిగిందని ఈజీగానే చెప్పచ్చు.
అదే సమయంలో ఈ వర్షాల సీజన్ ని.. బాహుబలి యూనిట్ మరో రకంగా కూడా ఉపయోగించేసుకుంటోంది. హరితహారం పేరుతో జరుగుతున్న కార్యక్రమానికి తమ వంతు మద్దతుగా.. మొక్కలు పాతేస్తున్నారు. ఒకవైపు తాను ఏర్పాటు చేసిన లైటింగ్ ను.. ఫోటోలు తీసి సినిమాటోగ్రాఫర్ పోస్ట్ చేస్తే.. ఇటు హరితహారం ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలను బాహుబలి యూనిట్ పోస్ట్ చేసింది. ఒకే రోజు రెండు రకాల యాక్టివిటీస్ తో బాహుబలి రచ్చ మామూలుగా లేదుగా.