కేజీఎఫ్ షూట్ లో సంజయ్ దత్ వార్తలపై క్లారిటీ
సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కన్నడ మూవీ 'కేజీఎఫ్ 2' షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ను మొన్నటి వరకు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ షెడ్యూల్ కు రెడీ అవుతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవలే హైదరాబాద్ కు షూటింగ్ కోసం వెళ్లబోతున్నట్లుగా పేర్కొన్న విషయం తెల్సిందే. ఆయన షూటింగ్ హైదరాబాద్ లో షూటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా చేయిస్తున్నాడు. ఈ షెడ్యూల్ లో సంజయ్ దత్ పాల్గొంటాడనే ప్రచారం జరుగుతోంది.
సంజయ్ దత్ క్యాన్సర్ కారణంగా కేజీఎఫ్ 2 షూటింగ్ లో పాల్గొనడం అనుమానమే అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆయన కేజీఎఫ్ 2 కోసం వస్తాడంటూ కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్న కారణంగా షూటింగ్స్ కు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే కమిట్ అయ్యి మద్యలో ఉన్న సినిమాలను పూర్తి చేసేందుకు గాను సంజయ్ దత్ ఓపిక తెచ్చకుని నటించబోతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల వారు సైతం అంటున్నారు.
కేజీఎఫ్ 2 లో భయంకరమైన అధీరా పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. భారీ యాక్షన్ సీన్ చిత్రీకరణ కోసం సంజయ్ దత్ రాబోతున్నాడు. ఆయనకు ఎక్కువ ఇబ్బంది లేకుండా షూటింగ్ ను పూర్తి చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడట. సంజయ్ దత్ ఎప్పుడు కేజీఎఫ్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.