• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విమానాశ్రయంలో సల్మాన్...

విమానాశ్రయంలో సల్మాన్ ఖాన్ నే ఆపేసిన యువ అధికారి?

By - Tupaki Desk
Update: 2021-08-24 07:31 GMT
దేశంలో సినీ, రాజకీయ ప్రముఖులకు రాచమర్యాదలు అందుతుంటాయి. వారు ఎక్కడికెళ్లినా ఫొటోలు, ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీల కోసం అందరూ ఎగబడుతుంటారు. ముఖ్యంగా సినీ హీరోలు వస్తే వారికి పెద్దపీట వేస్తారు. ఎక్కడైనా రెడ్ కార్పేట్ వేస్తారు. విధుల్లో ఉన్న అధికారులు కూడా ఇందుకు అతీతులు కారు..

నటీనటులు కనిపిస్తే విధులు పక్కనపెట్టి సెల్ఫీలు తీసుకున్న అధికారులు ఎందరో ఉన్నారు. మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఓ రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ ఆఫీస్ వెళితే తహసీల్దార్ సహా అందరూ ఆయనతొ ఫొటోలు దిగడానికి ఎగబడ్డారు. సీనీ నటులను దేశంలో అంతలా ఆరాధిస్తారు.

అయితే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ముంబై విమానాశ్రయంలో షాక్ తగిలింది. సెక్యూరిటీ చెక్ ను పట్టించుకోకుండా వెళుతున్న సల్మాన్ ఖాన్ ఏకంగా ఒక యువ సీఐఎస్ఎఫ్ అధికారి ఆపేశాడు. తొలుత వాటిని పూర్తి చేయమని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజాగా సల్మాన్ ఖాన్ ‘టైగర్3’ సినిమా షూటింగ్ కోసం రష్యా వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి వచ్చాడు. ఎయిర్ పోర్టులోకి ప్రవేశించడానికి ముందు తప్పనిసరిగా సెక్యూరిటీ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. సల్మాన్ అదేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడు సల్మాన్ ఊహించని షాక్ తగిలింది.

ఎంట్రన్స్ వద్ద ఉన్న యువ సీఐఎస్ఎఫ్ అధికారి సల్మాన్ ను లోపలికి వెళ్లకుండా అడ్డుకొని తొలుత సెక్యూరిటీ చెక్ పూర్తి చేయాలని కోరారు. అదే సమయంలో సల్మాన్ ఫొటోలను తీస్తున్న ఫొటోగ్రాఫర్లను సైతం వెనక్కి వెళ్లాల్సిందిగా ఆ అధికారి కోరడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెలబ్రెటీ ఫొటో గ్రాఫర్ వైరల్ బయానీ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. 





Viral Video: Salman Khan Stopped at Mumbai Airport enroute Russia by a Young CISF Officer; Asked to Stand in line and Complete Security Check like a Common Man pic.twitter.com/uEeuRjp5yA

— Megh Updates
Tags:    
  • salman khan 
  • salman khan movies 
  • salman khan tiger 3 
  • CISF personnel 
  • CISF officer 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS