చిత్రపురి అవకతవకలపై విచారణలో నిజం నిగ్గు తేలుస్తారా?
తెలుగు సినిమా 24శాఖల కార్మికుల సంక్షేమం కోసం నిర్మించిన చిత్రపురి కాలనీలో అవకతవకలు ఉన్నాయంటూ పలు అగ్ర దినపత్రికల్లో కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రకరకాల విచారణలు సాగాయి. అయితే ఇటీవలో ఓ అగ్రదినపత్రికలో చిత్రపురిలో ఇండ్లను రాజకీయనాయకులు ఉన్నతాధికారులకు గుట్టుచప్పుడు కాకుండా కట్టబెట్టారని కథనం వెలువడడం సంచలనమైంది. అయితే అందులో నిజం ఉందా లేదా తెలుసుకునేందుకు ఇప్పుడు విచారణ స్టార్టయ్యింది. ప్రస్తుత అధ్యక్షుడు వల్లభనేని చిత్రపురిపై అవన్నీ అసత్యపు ఆరోపణలు అంటూ కొట్టి పారేస్తున్నారు. నిజానిజాలు విచారణలోనే తేలుతాయని కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లో చిత్రపురి కాలనీపై వివిధ ఆరోపణలపై సెక్షన్ 51 ఎంక్వైరీ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాథమిక విచారణ జరుగుతోంది. పూర్తి నివేదిక అందిన తర్వాతే నిజానిజాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో అంతా సంమయనం పాటించాలని చిత్ర పురి కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని కోరారు. ఈ నెల 29న హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో ఎంక్వైరీ కమిటీ రిపోర్టును సభ్యులకు తెలియజేస్తామని అనిల్ కుమార్ తెలిపారు. ఈ జనరల్ బాడీ మీటింగ్ తర్వాత చాలా విషయాలపై స్పష్టత వస్తుందని అప్పుడు పూర్తి వివరాలు తెలియజేస్తామని అంతవరకు ఎవరూ అనవసర ప్రచారాలు చేయవద్దని అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ.....సెక్షన్ 51 ప్రిలిమినరీ ఎంక్వయిరీ రిపోర్ట్ తేది 03 ఆగస్టున సొసైటీ కమిటీకి అందజేసాం. సెక్షన్ 51 ఎంక్వయిరీ ప్రకారం రిపోర్ట్ 30 రోజులలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సభ్యులకు తెలియజేయాలి. కావున ఈ నెల 29న జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన ఫైండింగ్స్ పై సెక్షన్ 60 ఎంక్వయిరీ కూడా వేస్తారు. విచారణ ఆఫీసర్ ఇచ్చినది ప్రాథమిక నివేదిక మాత్రమే. ఈ విషయమై చర్చించడానికి జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాం. సెక్షన్ 60 ప్రకారం పూర్తి స్థాయి నివేదిక అందిన తరువాత నిజమైన అన్ని విషయాలు తెలుస్తాయి. దయచేసి అందరినీ పూర్తి ఎంక్వయిరీ రిపోర్ట్ వచ్చే వరకు వేచి చూడమని కోరుతున్నాం. జనరల్ బాడీ మీటింగ్ అయిన తర్వాత మేము అన్ని విషయాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేస్తాము. దీంతో ఆయా విషయాలపై స్పష్టత వస్తుంది. కాబట్టి 1600 సినీకార్మిక కుటుంబాల ఆవేదన అర్థం చేసుకుని ప్రాజెక్ట్ కు ఇబ్బంది కలగకుండా సహకరించాలని కోరుతున్నాం`` అన్నారు.
నిజానికి కార్మికులకు కట్టబెట్టాల్సిన అపార్ట్ మెంట్లను రియల్ బిజినెస్ గా మార్చి కాలనీ పరిపాలకులు కోట్లలో ఆర్జించారని ఇంతకుముందు పలుమీడియాల్లో కథనాలొచ్చాయి. ఆ క్రమంలోనే కొందరు బెదిరింపుల మీడియాధిపతులకు కూడా చిత్రపురిలో తాయిలాలు అందాయని మరో నివేదికను బయటపెట్టడంతో అది కాస్తా హీటెక్కించింది.
చిత్రపురిలో బడాబాబులు ఎవరెవరు ఉన్నారు? అన్నదానిపై లోతైన అధ్యయనం చేసిన సదరు పత్రికా కథనం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు ఆయన భార్యకు చిత్ర పురి హౌసింగ్ సొసైటీలో సభ్యత్వాలున్నాయి. ఆయనకు త్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్ ఉంది. దీనిపై అద్దెలు పొందుతున్నారు. అసలు వీరికి 24శాఖలతో ఏ సంబంధం లేదు. వీరికి సినిమాల్లో నటించినది లేదు. ఏ సంఘంలోనూ సభ్యత్వాలు కూడా లేవు.
పాత్రికేయుడిగా పని చేసి తర్వాత సొసైటీ సభ్యుడిగా చేరి రచయితల సంఘం మెంబర్ షిప్ కార్డ్ తో చిత్రపురిలో ఇల్లు పొందిన ఓ ప్రముఖుడు ఉన్నారు. హెచ్.ఐ.జీ డూప్లెక్స్ ని ఆయన పరం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఓ అభివృద్ధి సంస్థ చైర్మన్ సైతం చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం పొందారు. ప్రముఖ రాజకీయ పార్టీ కీలక వ్యక్తి అయిన ఆయనకు సినీరంగంతో ఎలాంటి సంబంధం లేదు. హెచ్ ఐజీ డూప్లెక్స్ విల్లాను వారికి కేటాయించారని తెలిసింది. వేరొక రాజకీయ పార్టీ మూడు రాష్ట్రాల ఇన్ ఛార్జికి హౌసింగ్ సొసైటీ సభ్యత్వంతో పాటు ట్రిపుల్ బెడ్ రూమ్ కేటాయించారట. సదరు నేత ముగ్గురు బంధువులు కూడా ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు పొందారు. ఎస్.బీ.ఐ గన్ ఫౌండ్రీ బ్యాంకులోని ఓ అధికారికి హెచ్.ఐ.జీలోనే 3 ప్లాట్లు ఉన్నాయి. అధికార పార్టీ న్యూస్ చానల్ వ్యక్తికి కూడా ఫ్లాట్ కేటాయించారట.
ప్రస్తుతం విచారణ సాగుతంది. ఎప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అలాగే చిత్రపురిలో ఇంకా అదనంగా ఉన్న కొన్ని ఎకరాల ఖాళీ స్థలంలో సినీకార్మికులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్న డిమాండ్ అలానే ఉంది. దీనికి సరైన పరిష్కారం లేదు.