• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నరేష్ అండ్ సునీల్.....

నరేష్ అండ్ సునీల్.. హీరోయిన్ దొరికింది

By - Tupaki Desk
Update: 2018-02-05 04:12 GMT
అల్లరి నరేష్.. సునీల్ ఇద్దరూ మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోలు. కేవలం హాస్యంతోనే హీరోలుగా స్టార్ పొజిషన్ కు చేరుకున్నారు. కానీ వీళ్లిద్దరికీ ఈ మధ్య టైం అస్సలు కలిసిరావడం లేదు. హిట్ అన్నది అందని ద్రాక్షలా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కెరీర్ లో అంకె మారుతోందే అదృష్టం కలిసిరావట్లేదు.

ప్రస్తుతం కెరీర్ లో హిట్ అత్యంత కీలకమైన ఈ తరుణంలో వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను భీమినేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండగా.. ఇప్పటికే ఒక హీరోయిన్ నందినిరాయ్ ని కన్ఫర్మ్ చేశారు. రెండో హీరోయిన్ గా కాస్త నటనతో మెప్పించగలిగే సొగసరి కోసం వెతుకుతున్నారు. చివరకు రంగులరాట్నం ఫేం చిత్ర శుక్లాను ఓకే చేశారు. రంగులరాట్నంలో లైఫ్ పై క్లారిటీ ఉన్న నేటితరం యువతిగా చిత్ర శుక్ల బాగానే ఆకట్టుకుంది. నటనపరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. చిత్ర శుక్ల నాచురల్ గా ఉంటూ అందంగా కనిపించడంతోపాటు ముఖంలో భావాలు పలికే నటి కావడంతోనే భీమినేని ఆమెను ఎంపిక చేసుకున్నాడని సినిమా యూనిట్ సభ్యుడొకరు తెలిపారు.

మధ్య ప్రదేశ్ కు చెందిన చిత్ర శుక్ల రంగులరాట్నం సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. పెద్ద బ్యానర్ లో సినిమా కావడంతో ఆ సినిమా హిట్టయితే టాలీవుడ్ లో గుర్తింపు వస్తుందని ఆశించింది. కానీ రంగులరాట్నం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కానీ చిత్రకు మాత్రం ఇంకో అవకాశం తెచ్చి పెట్టింది.
Tags:    
  • Chitra Shukla 
  • Sunil 
  • Allari Naresh 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS