దర్శకేంద్రుడి సినిమాకు సపోర్ట్ గా చిరు - వెంకీ..!
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''పెళ్లి సందD''. గౌరీ రోనంకీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో రాఘవేంద్రరావు వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ - శ్రీ లీలా జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్స్ అందించిని రాఘవేంద్రరావు తెరంగ్రేటం సినిమాకు సపోర్ట్ గా స్టార్ హీరోలందరూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టీజర్ ను కింగ్ అక్కినేని నాగార్జున లాంచ్ చేస్తే.. ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి - విక్టరీ వెంకటేష్ దర్శకేంద్రుడి సినిమాకి తమ వంతు సపోర్ట్ ఇస్తున్నారు.
''పెళ్లి సందD'' విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. దీనికి ముఖ్య అతిధులుగా సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి - వెంకటేష్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. రేపు (అక్టోబర్ 10) ఆదివారం సాయంత్రం 6 గంటలకు JRC కన్వెన్షన్ హాల్ లో ఈ వేడుక జరగనుంది. చిరు - వెంకీ కలిసి ఈ సినిమా బుకింగ్స్ కు బూస్టఫ్ ఇచ్చే అవకాశం ఉంది.
కాగా, 'పెళ్లి సందD' చిత్రాన్ని కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్ - ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై రూపొందిస్తున్నారు. మాధవి కోవెలమూడి - శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీధర్ సీపాన ఈ చిత్రానికి డైలాగ్స్ రాశారు. తమ్మిరాజు ఎడిటర్ గా.. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.
ప్రకాష్ రాజ్ - రాజేంద్రప్రసాద్ - రావు రమేష్ - తనికెళ్ళ భరణి - పోసాని కృష్ణ మురళి - వెన్నెల కిషోర్ - రాజీవ్ కనకాల - హేమ - ప్రగతి - ఝాన్సీ - శ్రీనివాస్ రెడ్డి - షకలక శంకర్ తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు. పాతికేళ్ళ క్రితం శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్ళిసందడి' సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ తో దర్శకేంద్రుడు చేసిన ''పెళ్లి సందD'' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.