చిరుని కమెడియన్ ని చేస్తున్న స్టార్‌ డైరెక్టర్‌

Update: 2020-03-13 06:45 GMT
మాస్ ని మెప్పించే క‌మ‌ర్షియ‌ల్ హీరోగా మెగాస్టార్ త‌న‌ స‌మ‌కాలీన స్టార్లంద‌రికీ ఓ స‌వాల్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఆయన న‌ట‌న‌లో విల‌క్ష‌ణ‌త అంతా ఇంతా కాదు.. న‌వ‌ర‌సాల్లో అద్భుతమైన హాస్యాన్ని పండించగల గొప్ప ట్యాలెంట్ త‌న సొంతం. నిజానికి ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా కమెడియన్స్ ఉన్నా వాళ్ల‌ను డామినేట్ చేసేంత కామెడీ టైమింగ్ త‌న‌లో ఉందని ప్రూవైంది. `చంటబ్బాయి`.. `అందరివాడు` లాంటి సినిమాలే అందుకు ఉదాహరణ. తనే కామెడీ.. యాక్షన్‌.. ఎమోషన్స్.. సెంటిమెంట్‌ పండించగలరు. అమాయకమైన ఎక్స్ ప్రెషన్స్.. న‌ట వైదూష్యంతో ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్వించగలరు. అలాంటి చిరంజీవి ఖైదీనంబ‌ర్ 150- సైరా లాంటి సీరియ‌స్ బ్యాక్ గ్రౌండ్ క‌థ‌ల‌తో కంబ్యాక్ అయ్యారు.

ఇక చాలా సంవ‌త్స‌రాల గ్యాప్ తర్వాత మరోసారి తనలోని కామెడీ యాంగిల్ ని పూర్తి స్థాయిలో బయటపెట్టబోతున్నారని తెలుస్తోంది. అది కూడా త్రివిక్రమ్‌ సినిమాలో కావడం విశేషం. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న చిరంజీవి తదుపరి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నార‌నేది దాదాపు కన్ఫమ్‌ అయ్యింది. ఇది ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంద‌ట‌. చిరు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో ఇది తొలి సినిమా. అయితే చిరుతో మంచి కమర్షియల్‌ ఎంటర్ టైనర్ ని తీయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నారు. ఆ రకంగానే స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంత‌కీ త్రివిక్ర‌మ్ స్క్రిప్టులో ప్ర‌ధానంగా హైలైట్ అయ్యే అంశం ఏమిటి? అంటే..

హీరో పాత్ర‌లో కామెడీ.. దాంతో పాటు వినోదానికి పెద్ద పీఠ వేస్తూ కమర్షియల్‌ అంశాలను జోడిస్తూ సినిమా తీయాలని భావిస్తున్నారట. మెగాస్టార్ తో ఎంటర్ టైన్ మెంట్‌ బేస్డ్ సినిమా అంటే అది ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే ఇటీవల బన్నీ హీరోగా త్రివిక్రమ్‌ చేసిన సింపుల్‌ ఎంటర్‌ టైనర్‌ `అల వైకుంఠపురములో` బాక్సాఫీసు వద్ద భారీ బ్లాక్‌ బస్టర్ గా నిలిచింది. మరి చిరంజీవి స్థాయి హీరోతో వినోదాత్మక సినిమా అంటే కచ్చితంగా నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక శ్రీ‌నువైట్ల మాత్ర‌మే అప్ప‌ట్లో చిరుని పూర్తి స్థాయి కామెడీ పాత్ర‌ లో చూపించారు. ఆ త‌ర్వాత ఇన్నాళ్టికి త్రివిక్ర‌మ్ త‌న సినిమా లో మెగా బాస్ ని ఆ లెవ‌ల్లో చూపిస్తాడ‌ట‌. అయితే వైట్ల‌ తో పోలిస్తే త్రివిక్ర‌మ్ సెన్సిబిలిటీస్ వేరు. మ‌రింత డీసెంట్ ఎప్రోచ్ ఉంటుంది. అంటే చిరు కాస్త క్లాస్ కామెడీ పండిస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.

ప్రసుతం చిరు- కొరటాల శివ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీనికి `ఆచార్య` అనే పేరుని పరిశీలిస్తున్నారు. ఇందులో చిరు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కి చెందిన అధికారిగా కనిపిస్తారని ప్ర‌చార‌మవుతోంది. కానీ ఇటీవల లీక్‌ అయిన ఫొటోల్లో చిరు నక్సల్స్ నాయకుడిగా ప్ర‌జా నాట్య‌మండ‌లి క‌ళాకారుడిగా కనిపిస్తున్నాడు. దీంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఇందులో మహేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని ప్ర‌చార‌మ‌వుతోంది. ఆయన ఒక‌ విద్యార్థి లీడర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. అందుకు భారీగా పారితోషికం ఆఫ‌ర్ చేశార‌ట‌. నిరంజన్‌ రెడ్డితో కలిసి రామ్ చరణ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహేష్‌- చరణ్‌ భాగం కావడం తో బిజినెస్‌ పరంగా భారీ హైప్‌ వచ్చిందని తెలుస్తోంది.



Tags:    

Similar News