శుభాకాంక్షలు చరణ్: తండ్రి చిరంజీవి

Update: 2020-03-27 10:14 GMT
మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికి హీరోగా అభిమానులను మెప్పిస్తున్నాడు. ఈరోజు మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఓపెన్ చేసిన ట్విట్టర్ అకౌంట్ లో తనయుడి గురించి పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో రాంచరణ్ పై చిరుకి ఉన్న ప్రేమనంత కురిపించినట్లే అన్పిస్తుంది. నేడు రాంచరణ్ కు సినీ ప్రముఖులంతా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇక తండ్రి చిరంజీవి చేసిన పోస్ట్ మాత్రం అందరినీ ఆకర్షిస్తుంది. 'నిజానికి చరణ్ పుట్టినప్పుడే నేను చాలా ఆనందపడ్డాను. చరణ్ మార్చ్ 27న అంటే ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజు పుట్టడం తో వీడి పుట్టుకకు ఏదో కారణం ఉంటుందని అప్పుడే అనుకున్నాను. నీటిలో చేపలా చరణ్ కూడా నటన నేర్చుకొని మీ అందరి అభిమానం పొందుతుంటే చాలా ముచ్చటేస్తుంది. శుభాకాంక్షలు చరణ్.." అంటూ పోస్ట్ చేశారు చిరు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయినా ఈరోజు సోషల్ మీడియా మొత్తం రాంచరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలతో నిండిపోయింది.
Tags:    

Similar News