• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #చిరు152: మహేష్ క్యామియో...

#చిరు152: మహేష్ క్యామియో చేస్తున్నాడా లేదా?

By - Tupaki Desk
Update: 2020-02-26 07:00 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాలశివ దర్శకత్వంలో #చిరు152 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తారని మొదట్లో అన్నారు.  అయితే 'RRR' పూర్తయ్యేవరకూ చరణ్ మరో సినిమాలో నటించే అవకాశం లేదట.  నిజానికి ఈ మార్చికే 'RRR' షూటింగ్ పూర్తవుతుందని.. వెంటనే #చిరు152 లో నటిస్తారని అనుకున్నారు కానీ షూటింగ్ డిలే కావడంతో చరణ్ ఈ సినిమాలో నటించడంపై సందిగ్ధత నెలకొంది.  దీంతో ఈ పాత్రలో నటిస్తారంటూ పలువురు ఇతర టాలీవుడ్ స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మహేష్ బాబు పేరు కూడా ఉంది.

ఈ సినిమాలో మహేష్ క్యామియో ఫిక్స్ అయిందని కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి.  కానీ అది నిజం కాదని సమాచారం. మహేష్ కు ఈ సినిమాలో క్యామియో చేసే ఆసక్తి ఉందా లేదా అని కొరటాల శివ క్యాజువల్ గా కనుక్కున్నారట. అంతకు మించి ఇంకేమీ లేదని..  ఈ సినిమాలో క్యామియో పాత్రను రామ్ చరణ్ చేస్తారని.. ఒకవేళ చరణ్ కు కుదరనిపక్షంలో ఆ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తారని సమాచారం. ఈ సినిమాలో ఎవరు ప్రత్యేక పాత్రలో నటిస్తారనే విషయంలో త్వరలోనే కొరటాల శివ క్లారిటీ ఇస్తారట.  ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో స్టార్ హీరోలలో ఎవరు నటించినా అది ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం.  మెగాస్టార్ సినిమాలో మరో స్టార్ హీరో నటించడం ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతినిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

కొరటాల శివ టాలీవుడ్ లో 100% సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు. ఆయన మొదటిసారిగా మెగాస్టార్ ను డైరెక్ట్ చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా కొరటాల ఒక సామాజిక కథాంశంతో తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. 
Tags:    
  • Chiru 152 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Chiru 152 Title 
  • Tollywood Latest News 
  • Telugu Movie News 
  • Tupaki News 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS