త్రో బ్యాక్ : డీప్ డిస్కషన్ లో చిరు - మహేష్...!

Update: 2020-07-08 12:30 GMT
టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉన్నప్పటికీ వారు రెగ్యులర్ గా కలిసి కనిపించరు. ఏదో సినిమా ఫంక్షన్ ఉంటేనే.. ప్రముఖులకు సంభందించిన శుభకార్యం అయితేనే.. ఇండస్ట్రీ మొత్తం కలిసి చేసుకునే ఉత్సవాల సమయంలోనో స్టార్స్ కలుస్తూ ఉంటారు. అయితే వారు తరచుగా కలుసుకోనంత మాత్రాన వారి మధ్య దూరం పెరిగింది అని అనుకోడానికి లేదు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి - సూపర్ స్టార్ మహేష్ బాబుల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ విషయాన్ని ఇద్దరూ పలు సందర్భాల్లో వెల్లడించారు. చిరు ఎప్పుడూ మహేష్ నాకు బిడ్డతో సమానం.. అతనితో కలిసి నటించడం నాకు ఆనందం కలిగించే విషయమని చెప్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు సైతం చిరంజీవి పట్ల గౌరవభావాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఛాన్స్ వస్తే 'ఆచార్య' సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. చిరంజీవి కూడా మహేష్ నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి మహేష్ పట్ల తన ఆప్యాయతను చాటుకున్నారు. ఇప్పుడు లేటెస్టుగా చిరు - మహేష్ కలిసిన సందర్భంలో తీసిన త్రో బ్యాక్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మహేష్ - చిరంజీవి లతో పాటు డైరెక్టర్ గుణశేఖర్ మరియు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. ఇందులో మహేష్ - చిరంజీవి - గుణశేఖర్ గురించో డీప్ గా డిస్కషన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక అల్లు అరవింద్ మాత్రం ఏదో పరధ్యానంలో ఆలోచిస్తున్నట్లు కూర్చున్నారు. ఈ ఫోటో చూస్తుంటే మహేష్ - గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన 'అర్జున్' సినిమా సెట్స్ లోది అయ్యుండొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేదా 'అర్జున్' సినిమా పైరసీకి సంభందించిన గొడవ గురించి చర్చించడానికి మహేష్ - చిరు కలిసిన సందర్భంలో తీసిన పిక్ అయ్యుండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా చిరు - మహేష్ కలిసి ఉన్న ఈ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ - సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతూ ఈ ఫోటోను షేర్ చేసేస్తున్నారు.
Tags:    

Similar News