మెగా బ్రదర్స్ చిరంజీవి- పవన్ కల్యాణ్ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో ఒకే మూవీలో వీక్షించే అరుదైన అవకాశం కోసం మెగాభిమానులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. చిరు- పవన్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ దర్శకుడిగా మల్టీస్టారర్ చేస్తామని కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి - వైజయంతి అధినేత అశ్వనిదత్ సంయుక్తంగా ప్రకటించారు అప్పట్లో. కానీ అది ఇప్పటివరకూ సాధ్యపడలేదు.
కనీసం ఒకే వేదికపై అయినా కనిపిస్తారా? అంటే అది కూడా చాలా అరుదు. ఏవైనా ఈవెంట్లలో చాలా చాలా రేర్ గా మాత్రమే ఆ ఇద్దరూ కలుస్తుంటారు. ఆ ఫోటోలను మెగాభిమానులు వైరల్ గా షేర్ చేస్తుంటారు.
తాజాగా అన్నదమ్ములిద్దరూ కలిసి ఉన్న ఓ రేర్ క్లాసిక్ డే ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇది ఫిబ్రవరి 1997 ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీ ఫోటోగ్రాఫ్. ``కాచింగ్ ది కరెంట్స్ ఆఫ్ తెలుగు సినిమా`` అనేది కవర్ శీర్షిక. `బ్రదర్ యాక్ట్` అనేది ప్రధాన శీర్షికగా అన్నదమ్ములపై చక్కని కవర్ స్టోరి వెలువడింది. చిరు ఆ ఏడాది హిట్లర్- మాస్టర్- బావ గారు బాగున్నారా? వంటి వరుస బ్లాక్ బస్టర్లలో నటించి మాంచి ఊపు మీద ఉన్నారు. పవన్ నటించిన డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996లో రిలీజైంది. 1997లో గోకులంలో సీత- సుస్వాగతం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మాంచి జోష్ తో ఉన్నాడు. ఆ ఏడాది ఇలా అన్నయ్యతో ఫిలింఫేర్ కవర్ పేజీపై దర్శనమిచ్చారు.
అసలు పవన్ కి ఇలాంటి ఫోటోషూట్లు ఏవీ ఇష్టం ఉండదు. కానీ అప్పట్లోనే అన్నయ్యతో కలిసి ఇలా ఫిలింఫేర్ కోసం ఫోజిచ్చారు. నూనూగు మీసాల దశను దాటుకుని గుబురు గడ్డం మీసకట్టు.. పక్క పాపిడితో పవన్ ఎంతో స్టైలిష్ గా స్మార్ట్ గానూ కనిపిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ అరుదైన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
``ఇప్పుడే వచ్చింది !!! వ్వావ్ వాటే ఫోటో.. వ్వాటే మూవ్ మెంట్ !!! చిరు సర్.. పవన్ సర్ .. అంటూ ట్వీట్ చేశారు దేవీ. ఈ కవర్ పేజీపై చిరు - పవన్ ఇద్దరూ హూడీలలో కనిపించారు. అన్నయ్యను పవన్ వెనుకనుండి కౌగిలించుకుని ఫోటోషూట్ కి ఫోజిచ్చారిలా. ఇది నిజంగా వెరీ రేర్ ఫోటో. అందుకే మెగాభిమానుల్లో వైరల్ గా మారింది.
ప్రస్తుతం చిరు- పవన్ ఇద్దరూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు నాలుగు సినిమాలకు కమిటై అన్నిటినీ పట్టాలెక్కించేస్తున్నారు. అయితే ఆ ఇద్దరూ కలిసి నటించే సినిమా కోసమే మెగాభిమానులు వెయిటింగ్. మరి అలాంటి అరుదైన సందర్భం ఇప్పుడే వస్తుందా లేదా చూడాలి.