మళ్లీ పాత రోజులు రావాలంటున్న మెగాస్టార్.. అసాధ్యం అంటున్న యంగ్ హీరోలు
సినిమా అంటే ఇప్పుడు కోట్లతో కూడుకున్న పని. కొన్ని సంవత్సరాల క్రితం లక్షలతో సినిమాను తీసేవారు. కాని ఇప్పుడు లక్షలు క్యారవాన్ కిరాయికి కూడా సరిపోవడం లేదు. హీరో.. హీరోయిన్ తో పాటు ఇతరు ముఖ్య నటీనటులకు కూడా క్యారవాన్ ఏర్పాటు చేయాల్సి వస్తున్న కారణంగా వాటికే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఈమద్య కాలంలో ఎన్నో వృదా ఖర్చులు పెడుతున్నారు. నిర్మాతపై భారం మోపుతూ లగ్జరీగా ఉండేందుకు లక్షలు కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు.
సినిమాకు సంబంధం లేని వాటికే నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. గతంలో ఈ వృదా ఖర్చులు 90 శాతం తక్కువగా ఉండేవి. అందుకే బడ్జెట్ తక్కువ అయ్యేది. తాజాగా అదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. సెట్స్ లో క్యారవాన్ ల్లో హీరోలు హీరోయిన్స్ ఉండే పద్దతికి స్వస్థి చెప్పాలని ఆయన పిలుపునిచ్చాడు. షూటింగ్ సెట్ లో కుర్చి వేసుకుని కూర్చోవాలని.. వెంట వెంటనే షాట్స్ పూర్తి అయ్యే అవకాశం ఉంటుందని అన్నాడు.
క్యారవాన్ వల్ల చాలా సమయం వృదా అవ్వడంతో పాటు నిర్మాతకు ఆర్థికంగా భారం అవ్వడం వల్ల హీరోలు మరియు దర్శకులు ఆ పద్దతికి స్వస్థి చెప్పాలంటూ చాలా మంది నిర్మాతలు కొన్ని రోజులు గా కోరుకుంటున్నారు. ఇప్పుడు మెగాస్టార్ అదే విషయాన్ని లేవనెత్తడంతో మరోసారి ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.
గతంతో పోల్చితే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. గతంలో క్యారవాన్ లు లేకుండా షూటింగ్స్ చేసేవారు. ఇప్పుడు అది సాధ్యం కాదని యంగ్ హీరోలు అంటున్నారు. షాట్ కు రెడీ అయ్యేందుకు మరియు డైలాగ్ ప్రాక్టీస్ కు క్యారవాన్ తప్పనిసరి అంటున్నారు. జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటం వల్ల క్యారవాన్ లు తప్పనిసరి అంటూ యంగ్ హీరోలు మెగాస్టార్ కు ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇతర హీరోల సంగతి ఏమో కాని మెగాస్టార్ సూచనను కనీసం మెగా హీరోలు అయినా పాటిస్తారేమో చూడాలి. వారి వరకు పాటించినా మళ్లీ మునుపటి రోజులు ఇప్పటికప్పుడు కాకున్నా ముందు రోజుల్లోనైనా వస్తాయని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.