మెగాస్టార్ 'మై డియర్ బచ్చా' ట్వీట్ వైరల్

Update: 2020-05-02 11:30 GMT
దేశంలో లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఇక సెలబ్రిటీలు సైతం అన్ని పక్కనపెట్టి తమ ఇంట్లోనే ఉంటూ కరోనాపై అవగాహన కలిపిస్తూ ఇంట్లో వాళ్ళతో సమయం గడుపుతున్నారు. మెగాస్టార్ ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆయన ట్వీట్స్‌లో సైతం మెగా మార్క్ చూపిస్తున్నారు. ప్రారంభంలో మోహన్ బాబు‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్స్‌ సోషల్ మీడియాలో ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఛలోక్తులు, చమత్కారాలకు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా సుపుత్రుడు రాంచరణ్ పై ఫన్నీ ట్వీట్ చేశారు. ఇటీవల రాంచరణ్ తన తల్లి సురేఖ, నాన్నమ్మ అంజనా దేవితో కలిసి పెరుగు నుంచి వెన్న తీయడం నేర్చుకున్నారు. చరణ్ మజ్జిగ చిలుకుతుంటే చిరు తల్లి కృష్ణుడి లాగా ఉన్నవంటూ ప్రశంసలు కురిపించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలలో పోస్ట్ చేశాడు చరణ్.

అయితే ఈ వీడియో పైన చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు. "మై డియర్ బచ్చా ...మా అమ్మ దగ్గర నీ 'బట్టర్ ' ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. నువ్వు ఎంత కష్టపడి బటర్ చిలికినా, నీ ప్లేస్ ఇంతకంటే ఎప్పుడూ బెటర్ అవదు. అయితే అదే గ్యారెంటీ నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో" అంటూ మెగాస్టార్ సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది సైరా సినిమాతో ముందుకొచ్చిన చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. ఇప్పటికే సినిమా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
Tags:    

Similar News