• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇలా ర‌చ్చ‌కెక్కితే 'మా'...

ఇలా ర‌చ్చ‌కెక్కితే 'మా' సొంత బిల్డింగ్ క‌డ‌తారా?

By - Tupaki Desk
Update: 2020-01-02 11:05 GMT
దాదాపు 900 మంది ఆర్టిస్టులు ఉన్న అతి పెద్ద సంఘం `మూవీ ఆర్టిస్టుల అసోసియేష‌న్`. ద‌శాబ్ధాల పాటు `మా` కార్య‌క‌లాపాలు విజ‌య‌వంతంగా సాగ‌డ‌మే గాక ఎంతో హుందాగా సాగాయి. కోట్లాది రూపాయ‌ల నిధిని సేక‌రించే స‌త్తా ఉన్న అసోసియేష‌న్ ఇది. అన్నీ స‌వ్యంగా సాగితే ఈపాటికే సొంత భ‌వంతిని నిర్మించుకోవాల్సింది. కానీ ఇక్క‌డ ఏదో లోపం ఆ ప‌నిని జ‌ర‌గ‌నివ్వ‌లేద‌న్న సందేహాలున్నాయి. అవేమిటి? అన్న‌ది సినీ పెద్ద‌ల‌కు చాలా స్ప‌ష్టంగా తెలుసు. గ‌త అధ్య‌క్షుల స్వార్థ రాజ‌కీయాలు స్వ‌యంకృతం ఒక కార‌ణం అనుకుంటే.. ఇటీవ‌లి కాలంలో మూవీ ఆర్టిస్టుల సంఘంలో నిప్పు ఉప్పులా మారిన రాజ‌కీయాలు.. వివాదాల ర‌చ్చ మ‌రింత దిగ‌జార్చిన వైనం ప్ర‌త్య‌క్షంగా మీడియా ముఖంగా బ‌య‌ట‌ప‌డుతోంది. ఓవైపు సినీ పెద్ద‌లు గొడ‌వ‌ల్ని చ‌ల్లార్చాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా ప‌రిష్కారం అన్న‌దే లేకుండా పోయింద‌న్న తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. నేడు మా డైరీ ఆవిష్క‌ర‌ణ ర‌సాభాస‌ను టీవీ చానెళ్ల లైవ్ లో చూసిన జ‌నం విస్తుపోవాల్సిన ప‌రిస్థితి.

ఇక ఈ వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి - కృష్ణంరాజు- మోహ‌న్ బాబు అంత‌టి వారే మా ప‌రువు త‌క్కువ ప‌నుల‌పై ఆవేద‌న వెల్ల‌గ‌క్కారు. వివాదాల ర‌చ్చ‌కు చిర్రెత్తి పోయారు. క‌లిసి వెళ‌దాం.. అంత‌ర్గ‌తంగా ప‌రిష్కారం కావాలి అని ప‌దే ప‌దే మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆవేద‌న‌గా వారించే ప్ర‌య‌త్నం చేసినా ఎవ‌రూ ఆయ‌న మాట విన‌లేదు.

అంతేకాదు.. ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న క‌మిటీలో వివాదాల ర‌చ్చ వ‌ల్ల‌నే మా అసోసియేష‌న్ సొంత భ‌వంతి నిర్మించుకోవ‌డం సాధ్య‌ప‌డ‌లేద‌ని చిరు ఈ మీటింగ్ లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వివేదాల్ని ప‌క్క‌న పెట్టి ప‌రిష్కారం కావాల‌ని కోరారు. అంతేకాదు.. అసోసియేష‌న్ భూమి కోసం మంత్రి కేటీఆర్ ను రిక్వెస్ట్ చేశానని... కుమ్ములాటలు.. అంతర్గత విభేదాల కారణంగా అది వాయిదా పడింద‌ని చిరు వెల్ల‌డించ‌డం స‌భ్యుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

అంతేకాదు తమిళ పరిశ్రమలో నడిగర సంఘం గొప్పగా నిధిని సేక‌రించి పేద ఆర్టిస్టులకు ఇళ్లు కట్టించి ఇస్తున్నారనే విషయం తెలుసుకోని ఈర్ష పడ్డానని చిరు అన్నారు. సంఘంలో లుక‌లుక‌ల వ‌ల్ల‌నే మ‌నం పురోగ‌తిని సాధించ‌లేక‌పోయామ‌ని ప్ర‌స్తుత క‌మిటీలో వివాదాల‌పై త‌న‌దైన శైలిలో చుర‌క‌లు అంటించే ప్ర‌య‌త్నం చేశారు. సంఘంలో మంచి విషయాలు ఉంటే మైక్‌లో చెప్పుకొందాం. చెడు విషయాలు ఉంటే చెవిలో చెప్పుకొందాం. విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగుదాం అని చిరంజీవి మా సభ్యులకు సూచించారు.




Tags:    
  • Chiranjeevi Fires On Rajasekhar 
  • Rajasekhar 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS