• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ పిలిచినా రాని...

మెగాస్టార్ పిలిచినా రాని హీరో ఎవరు

By - Tupaki Desk
Update: 2018-01-26 04:18 GMT
అదేంటి మెగాస్టార్ చిరంజీవి అంతటి వారు స్వయంగా పిలిస్తే రాని వారు ఎవరు ఎవరుంటారా అని ఆశ్చర్యపోకండి. కాని అలా జరిగిందని చిరు స్వయంగా తన ఫ్లాష్ బ్యాక్ షేర్ చేసుకోవడం నిన్న జరిగిన ఛలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హై లైట్ గా నిలిచింది. తనతో కనీసం ముఖ పరిచయం కూడా లేని చిన్న హీరో నాగ శౌర్య సినిమా వేడుకకు తాను ఎందుకు వచ్చానా అనే సందేహం మీకు వచ్చి ఉంటుందని చెబుతూ దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఈ రూపంలో ఆయన బదులిచ్చారు. తన కెరీర్ ప్రారంభంలో చక్కని విజయాలు సాధిస్తున్న దశలో ఒక సినిమా వంద రోజులు పూర్తి చేసుకుందని, ఆ వేడుకకు రమ్మని పిలవడానికి తాను ఎంతో అభిమానించే ఒక సీనియర్ హీరో దగ్గరకు వెళ్ళానని, కాని బిజీగా ఉన్న కారణంతో ఆయన రాలేనని చెప్పడంతో వెనక్కు వచ్చేసారట చిరు.

వేడుక పూర్తయ్యింది. తూ తూ మంత్రంగా ఆ 100 డేస్ ఫంక్షన్ జరిగిపోయింది. ఆ హీరో రాలేదనే లోటు చిరు మనసును బాగా గాయపరిచింది. ఆయన వచ్చుంటే సభ కళకళలాడేది, తమకు కూడా ఎంతో ప్రోత్సాహం కలిగేదే అని చిరు అనుకున్నారు ఇప్పుడు ఛలో కోసం నాగ శౌర్య తనను రెండు మూడు సార్లు ఫోన్ ద్వారా కలవాలని ప్రయత్నించినప్పుడు బిజీ గా ఉండి వెంటనే అందుబాటులోకి రాలేకపోయిన చిరు ఆ తర్వాత ఇంటికి రమ్మని ఆహ్వానించారు. తల్లి ఉషా గారితో వచ్చిన శౌర్య ఛలో వేడుకకు గెస్ట్ గా రమ్మని రిక్వెస్ట్ చేసినప్పుడు చిరుకి అప్పుడెప్పుడో జరిగిన ఆ సంఘటన గుర్తొచ్చింది.

మరో ఆలోచన చేయకుండా వెంటనే వస్తానని చెప్పారట. అప్ కమింగ్ హీరోస్ కు తన లాంటి సీనియర్స్ రావడం ఎంత ఆనందాన్ని ఇస్తుందో మిస్ చేసుకున్న తనకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టే శౌర్య, ఆయన తల్లి గారు అడిగిన వెంటనే రెండో ఆలోచన చేయకుండా వచ్చానన్న చిరు కొత్త లుక్ తో ఛలో ఈవెంట్ లో సెంటర్ అఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. ప్రగతి, కళ్యాణి మాలిక్, వంశీ పైడిపల్లి తదితరులు చిరుని ఎదురుగా పెట్టుకుని మాట్లాడడం కష్టంగా ఉందని ఎగ్జైట్ అవ్వడం విశేషం. ఇంతకీ చిరు పిలిచినా రాని హీరో ఎవరో మరి.
Tags:    
  • Chiranjeevi 
  • Chalo Movie Pre Release Event 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS