వీడియో: కరోనా చేసిన మేలుపై చిరు మనవరాలు..!
కరోనా కల్లోలం నేపథ్యంలో సెలబ్రిటీలంతా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ నిరంతరం ప్రజలకు టచ్ లో ఉంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సోషల్ మీడియాల్లో మరింత యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. కొందరు సినీపెద్దలతో కలిసి సీసీసీ చారిటీని ప్రారంభించి సినీకార్మికులకు నిత్యావసరాల్ని అందించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. ఇక చిరు ట్విట్టర్ లో నిరంతరం సీసీసీ కార్యక్రమాల్ని వెల్లడిస్తున్నారు. ఈ విపత్తు వేళ బ్లడ్ బ్యాంక్ లకు రక్తదానం అవసరాన్ని గుర్తు చేస్తున్నారు.
లేటెస్టుగా ఆయన తన మనవరాలిని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పరిచయం చేశారు. తన పేరు వివి. శ్రీజకు తొలి సంతానం. వివి అంటే తాతయ్య(చిరు)కు ఎంతో ఇష్టం. తనని వివి తల్లి అని పిలుస్తారంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఇక కరోనా ఔట్ బ్రేక్ అనంతరం వాతావరణంలో మార్పులు సహా ప్రపంచ వ్యాప్తంగా అసలేం జరుగుతోంది? అన్నదానిపై వివి చెప్పిన సంగతులు ఆకట్టుకున్నాయి.
``కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం తగ్గింది. భూతాపం తగ్గింది. సముద్ర తీరంలో డాల్ఫిన్స్ ఎంతో స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నాయి. దిల్లీలో కాలుష్యం తగ్గి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. ఇక స్కై ఎంతో నిర్మలంగా మనోహరంగానూ కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. లోకానికి అంతా మంచినే చెబుదాం. స్టే హోమ్.. స్టే సేఫ్`` అంటూ చక్కని సందేశం ఇచ్చింది వివి. ఈ వీడియోని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో జోరుగా వైరల్ చేస్తున్నారు. Full View Full View
లేటెస్టుగా ఆయన తన మనవరాలిని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పరిచయం చేశారు. తన పేరు వివి. శ్రీజకు తొలి సంతానం. వివి అంటే తాతయ్య(చిరు)కు ఎంతో ఇష్టం. తనని వివి తల్లి అని పిలుస్తారంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఇక కరోనా ఔట్ బ్రేక్ అనంతరం వాతావరణంలో మార్పులు సహా ప్రపంచ వ్యాప్తంగా అసలేం జరుగుతోంది? అన్నదానిపై వివి చెప్పిన సంగతులు ఆకట్టుకున్నాయి.
``కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం తగ్గింది. భూతాపం తగ్గింది. సముద్ర తీరంలో డాల్ఫిన్స్ ఎంతో స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నాయి. దిల్లీలో కాలుష్యం తగ్గి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. ఇక స్కై ఎంతో నిర్మలంగా మనోహరంగానూ కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. లోకానికి అంతా మంచినే చెబుదాం. స్టే హోమ్.. స్టే సేఫ్`` అంటూ చక్కని సందేశం ఇచ్చింది వివి. ఈ వీడియోని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో జోరుగా వైరల్ చేస్తున్నారు.