సమ్మర్‌ నుంచి మెగాస్టార్‌ -కొరటాల సినిమా..?

Update: 2019-01-02 06:45 GMT
మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆగస్ట్‌ రిలీజ్‌ గా ఈ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు. తర్వాత ఏంటి.? సైరా తర్వాత మెగాస్టార్‌ ప్రాజెక్ట్‌ ఏంటి.?. వినయ విధేయ రామ ఆడియో ఫంక్షన్‌ జరిగే వరకు.. అందరికి కొరటాల శివతో సినిమా అనే తెలుసు. కానీ ఆ ఆడియోలో త్రివిక్రమ్‌ తో సినిమా ఉంటుందని చెప్పేసరికి.. కొరటాల శివతో సహా అందరూ షాక్‌ అయ్యారు. సినిమా ఆగిపోయినట్లేనని భావించారు. అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోలేదని .. సమ్మర్‌ నుంచి మెగాస్టార్‌-కొరటాల శివసినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఇండస్ట్రీ టాక్‌.
      
సైరా సినిమా సమ్మర్‌ నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌ ఒక్కటే ఉంటుంది. దీంతో.. సమ్మర్‌ నుంచి కొరటాల శివతో మూవీ స్టార్ట్‌ చేయబోతున్నాడు మెగాస్టార్‌. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కథ, కథనాల్ని కూడా శివ పూర్తిచేశాడు. ఇక త్రివిక్రమ్‌ బన్నీ కోసం కథని సిద్ధం చేస్తున్నాడు. అల్లు అర్జున్ తో సినిమా పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ మెగాస్టార్‌ మూవీకి షిఫ్ట్‌ అవుతాడు. ఈ లోపుగా కొరటాల శివ కూడా చిరంజీవి సినిమాను కంప్లీట్‌ చేయాలని అనుకుంటున్నాడు.




Full View

Tags:    

Similar News