అర్నబ్ గోస్వామిని ఇమిటేట్ చేసి నవ్వులపాలైన రచయిత...!
'నరసింహ నాయుడు' ‘ఇంద్ర’ ‘గంగోత్రి’ ‘బద్రీనాథ్’ వంటి భారీ చిత్రాలకు కథలను అందించాడు ప్రముఖ కథారచయిత చిన్నికృష్ణ. చివరగా 'జీనియస్' అనే చిత్రానికి స్టోరీ అందించిన చిన్నికృష్ణ తర్వాత నిర్మాతగా మారాడు. రచయితగా ఆయన తెలిసింది తక్కువే అయినా వివాదాలతో మాత్రం బాగానే ఫేమస్ అయ్యాడు. అనవసరమైన విషయాల్లో తల దూర్చుతూ నెటిజన్ల చేతిలో ట్రోల్స్ ఎదుర్కోవడం ఈ స్టార్ రైటర్ కి ఫస్ట్ నుండి అలవాటైన పనే. అప్పట్లో తారా చౌదరి అనే మహిళతో వచ్చిన ఇష్యూతో వార్తల్లో నిలిచాడు. గతేడాది జనరల్ ఎలక్షన్స్ కి ముందు వైయస్సార్ పార్టీలో జాయిన్ అయి మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరూ దేవుళ్ళు అంటూ పొగిడి విమర్శలపాలయ్యాడు. ఇలా డబుల్-స్టాండర్డ్ చూపించడం అతనికి కొత్తేమీ కాదు. ఇప్పుడు తాజాగా రిపబ్లిక్ టీవీ వివాదాస్పద జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామికి సపోర్ట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసి నెటిజన్ల ట్రోల్స్ కి బలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ముగ్గురు వ్యక్తుల్ని స్థానికులు కొట్టిచంపారు. లాక్ డౌన్ వేళ అనుమానాస్పదంగా సంచరిస్తోన్న వాళ్లను దొంగలుగా భావించి గ్రామస్తులు దాడి చేశారు. దీనికి సంబంధించి కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో శివసేన నేతృత్వంలో నడుస్తోన్న మహారాష్ట్ర సర్కారుపై అర్నబ్ రిపబ్లిక్ టీవీలో వార్తలు ప్రసారమయ్యాయి. సాధువుల్ని కొట్టి చంపింది ముస్లింలేనని అర్నబ్ వాదించారు. ఆ తర్వాత అర్నబ్ కాంగ్రెస్ అధినేత్రిపై వ్యక్తిగత విమర్శలకు దిగడంతో వివాదం మరింత పెద్దదైంది. పాల్ఘర్ ఘటనపై తన రిపబ్లిక్ టీవీలో చర్చ సందర్భంగా అర్నబ్.. సోనియా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన కారుపై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి జరిపారు. అంతేకాకుండా పాల్ఘర్ ఘటనపై మతవిద్వేషాలు రెచ్చగొట్టడంతోపాటు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ అర్నబ్ గోస్వామిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రచయిత చిన్ని కృష్ణ అర్నబ్ గోస్వామిని సపోర్ట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసాడు.
ఈ వీడియోలో చిన్నికృష్ణ అర్నబ్ మాదిరిగా సూట్ ధరించి అతనిని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేసాడు. దీంట్లో చిన్ని కృష్ణ మాట్లాడిన ఇంగ్లీష్ చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. చిన్నికృష్ణకి నిజంగానే ఇంగ్లీష్ రాదా.. లేక అర్నబ్ ని ఇమిటేట్ చేయాలని అలా మాట్లాడాడో తెలియదు కానీ మొత్తానికి నెటిజన్ల ట్రోల్స్ ఎదుర్కున్నాడు. ఈ వీడియోకి 'RIP ENGLISH' అని కామెంట్స్ పెడుతున్నారు. 'అతను ఏమి తప్పు చేశాడు? మిస్టర్ గోస్వామి? ఎనీ ఫాల్స్? ఏదైనా మోసం చేయబడిందా? ఏదైనా ప్రభుత్వం చేత? అంటూ వచ్చీ రాణి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఆయనపై దాడిని ఖండించి.. నెంబర్ వన్ జర్నలిస్ట్ అర్నబ్ ని అందరూ సపోర్ట్ చేయాలని కోరాడు. ఏదేమైనా చిన్నికృష్ణ ఇలా అర్నబ్ ని ఇమిటేట్ చేసి నెటిజన్లను నవ్వించి ట్రోల్స్ గురయ్యాడని చెప్పవచ్చు.