ఫిల్మ్ ఛాంబర్ నుండి టైటిల్ లీకులకు చెక్
మునుముందు రానున్న సినిమాలకు సంబంధించిన టైటిల్స్ ఇవీ అంటూ ఫిలింఛాంబర్ నుంచి నెలవారీ బులెటిన్ విడుదలయ్యేది. కానీ ఇకపై అది రిలీజ్ కాదని తెలిసింది. ముందే టైటిళ్లను బయటికి ప్రకటించే ఆలోచనను ఇక విరమించనున్నారని దీనివల్ల నిర్మాతలకు చాలా వరకూ తలనొప్పి తగ్గించేలా ప్రయోజనకర నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
నిజానికి పెద్ద హీరోల సినిమాలకు టైటిల్స్ ఇవీ అంటూ మీడియాలో బోలెడంత హంగామా ఉంటుంది. టైటిల్ లాంచింగ్ అధికారికం కాకముందే చాంబర్ నుంచి లీకుల వల్లనే మీడియాకి తెలిసిపోతోంది. ఇలాంటివి మీడియాలో బోలెడన్ని లీకులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే తేడా లేకుండా అసలు టైటిల్ అన్నది ఇక బయటికి చెప్పరట. ఇక మీదట ఫిలింఛాంబర్ నుంచి అధికారికంగా టైటిళ్ల వివరాల్ని మీడియాకి వెల్లడించరు. ఏదేమైనా ఇది నిర్మాతలకు స్వాగతించే చర్య. వారు అభిమానుల నుండి ఇకపై ఎలాంటి ఒత్తిడులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ప్రతిదీ అధికారికంగా ప్రకటించాకే ఇతర ప్రచార హడావుడికి ఆస్కారం ఉంటుంది.