• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆర్ ఆర్ ఆర్' వాయిదా పై...

'ఆర్ ఆర్ ఆర్' వాయిదా పై స్పందించిన చరణ్!

By - Tupaki Desk
Update: 2022-01-13 03:03 GMT
తెలుగు చిత్రపరిశ్రమలో దిల్ రాజు అడుగుపెట్టి పాతికేళ్లు అవుతోంది. ఈ పాతికేళ్లలో ఆయన ఎంతోమంది స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. టాలీవుడ్ లోని టాప్ ప్రొడ్యూసర్స్ లో ఆయన ఒకరుగా ఎదిగారు. ఇక ఇప్పుడు ఆయన తన సోదరుడి తనయుడైన ఆశిష్ రెడ్డిని 'రౌడీ బాయ్స్' సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆశిష్ రెడ్డి జోడీగా అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. చరణ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ. దిల్ రాజుతో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించాడు. అలాగే ఆశిష్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆయన యాక్టింగ్ లోను .. డాన్స్ లోను చాలా ఈజ్ ఉందంటూ అభినందించాడు. ప్రొడక్షన్ జోలికి వెళ్లకుండా యాక్టింగ్ పైనే ఫోకస్ చేయమని సలహా ఇచ్చాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ టాలెంట్ ను మాత్రమే నమ్ముకుని కష్టపడాలని చెప్పాడు. తాను .. ప్రభాస్ .. మహేశ్ అలాగే ఈ స్థాయికి వచ్చామని అన్నాడు. ఇక్కడ బన్నీ పేరు చెప్పకపోవడం హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.

ఇక చివరిలో చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను గురించి ప్రస్తావించాడు. "ఈ సంక్రాంతికి మా సినిమా రాకపోయినా మాకేం బాధలేదు. ఎందుకంటే సరైన సమయంలో 'ఆర్ ఆర్ ఆర్' రావాలి. ఆ సినిమా కోసం మూడున్నర సంవత్సరాలు కష్టపడ్డాము. ఆ సినిమా ఎప్పుడు రావాలనేది రాజమౌళి గారు .. దానయ్యగారు డిసైడ్ చేస్తారు. సంక్రాంతి మాకు ఎంత ముఖ్యమో మాకు తెలియదు గానీ, సంక్రాంతి ఫెస్టివల్ కి దిల్ రాజుగారు మాత్రం చాలా ముఖ్యం. సంక్రాంతి మమ్మల్ని వదులుకోవడానికైనా రెడీగా ఉంది కానీ, దిల్ రాజును వదులుకోవడానికి మాత్రం రెడీగా లేదు.

ఇలాంటి సక్సెస్ ఫుల్ సంక్రాంతులు ఎన్నో ఆయన చూశారు. మళ్లీ ఈ సంక్రాంతి ఆయనదే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి వారికి తిరుగులేని సంక్రాంతి కావాలని ఆశిస్తున్నాను. అభిమానులను ఉద్దేశించి .. ఇక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఎక్కడ ఫంక్షన్ పెట్టినా మా అబ్బాయిలంతా వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తూ బ్లెస్ చేస్తున్నారు. మమ్మల్ని బ్లెస్ చూస్తున్నట్టుగానే ఆశిష్ ను కూడా బ్లెస్ చేయండి. మిమ్మల్ని ఆయన డిజప్పాయింట్ చేయడని చెబుతూ, ఈ సినిమా టీమ్ కి మరోసారి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను" అంటూ ముగించాడు.    
Tags:    
  • RRR 
  • RRR movie 
  • RRR Release Date 
  • RRR Shooting 
  • NTR 
  • Ramcharan 
  • Rajamouli 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS