పదమూడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన యాసిడ్ దాడిలో గాయపడ్డ లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా చపాక్. ఈ చిత్రంలో దీపికాపదుకొనే కథానాయిక. ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచిన లక్ష్మీ అగర్వాల్ జీవితానికి సంబంధించిన ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రాంత్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాకి సంబంధించి తరచూ లీక్ ల వల్ల క్యూరియాసిటీ పెరిగింది.
ఇటీవలే దీపిక స్కూల్ డ్రెస్లో ఉన్న వీడియో ఒకటి బయటకు రాగా.. సినిమాలో కీలకమైన ఓ ముద్దు సన్నివేశం బయటకొచ్చింది. ఈ సినిమా మెజారిటీ భాగం దిల్లీలో చిత్రీకరణ జరుపుకుంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. 2020 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా చపాక్ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం యాసిడ్ బాధితురాలి రియల్ ఎమోషన్ కనిపిస్తోంది. లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక ఎంతో లీనమైన నటించిందని ట్రైలర్ చెబుతోంది. నడిరోడ్డుపై యాసిడ్ దాడి జరిగినప్పుడు లక్ష్మీ అగర్వాల్ ఎమోషన్ ని అడాప్ట్ చేసుకోవడంలో దీపిక కు ప్రశంసలు కురవడం ఖాయం. ఇక దాడి తర్వాత ఆస్పత్రిలో డాక్టర్ల చికిత్స.. అనంతరం అద్దంలో తనని తాను తొలిసారి చూసుకుని ఆవేదన చెందిన తీరు ఒక రకంగా ఆ బాధను రియల్ బాధితురాలి హృదయవిదారకమైన సన్నివేశాన్ని ఊహిస్తేనే భయం కలగక మానదు. మేఘనా గుల్జార్ మరో అద్భుత ప్రయత్నమిదని చెప్పొచ్చు.
Full View