దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి క‌నిక‌రించ‌లేదు!

Update: 2020-11-08 05:45 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ `అజ్ఞాత‌వాసి` త‌రువాత దాదాపు రెండేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా వున్నారు. జ‌న‌సేన పార్టీ కార్య‌కలాపాల్లో యాక్టివ్ ‌గా వుండ‌టం కోసం సినిమాల‌కు కొంత బ్రేకిచ్చిన ప‌వ‌ర్ ‌స్టార్ `వ‌కీల్ సాబ్‌`తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని శ్రీ‌రామ్ వేణు తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ గ‌త ఏడెనిమిది నెల‌లుగా క‌రోనా కార‌ణంగా ఆగిపోయింది. ఇటీవ‌లే మ‌ళ్లీ మొద‌లైంది.

ఈ మూవీతో పాటు క్రిష్ చిత్రాన్ని కూడా ప‌వ‌న్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఫిక్ష‌న‌ల్ పిరియాడిక్ స్టోరీ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏ.ఎం. ర‌త్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు. లాక్ ‌డౌన్ ‌కి ముందు కొంత భాగం షూటింగ్ జ‌రిగింది. లాక్ డౌన్ అమ‌ల్లోకి రావ‌డంతో తాత్కాలికంగా షూటింగ్‌ని నిలిపివేశారు. మ‌ళ్లీ షూటింగ్ ‌లు మొద‌లైనా ప‌వ‌న్ `వ‌కీల్ ‌సాబ్‌`కే ముందు ప్రియారిటి ఇవ్వ‌డంతో క్రిష్ ఈ స‌మ‌యంలో చిన్న చిత్రాన్ని పూర్తి చేశాడు. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ర‌కుల్ హీరోయిన్‌గా ఓ స్మాల్ బ‌డ్జెట్ చిత్రాన్ని పూర్తి చేశారు.

`వ‌కీల్ సాబ్‌` పూర్తి కాగానే ప‌వ‌న్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్ ‌ని స్టార్ట్ చేయ‌బోతున్నాడు. ఇది పూర్త‌యితే గానీ క్రిష్ ‌కి డేట్స్ ఇవ్వ‌లేని ప‌రిస్థితి. దీంతో ఈ మూవీ స్క్రిప్ట్ ‌కి మరిన్ని మెరుగులు దిద్దాల‌నుకుంటున్నార‌ట‌. పైగా ఈ చిత్రానికి ఇప్ప‌టికీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ‌లను ఫైన‌ల్ చేయ‌లేదు. ప్రాప‌ర్ ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌ర‌గ‌లేదు. ఇవ‌న్నీ క్రిష్ అదృష్టంతో పాటు అత‌ని స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నాయ‌ట‌. దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి క‌నిక‌రించ‌లేద‌న్న‌ట్టుగా మారింది క్రిష్ ప‌రిస్థితి. 
Tags:    

Similar News