'ఎన్టీఆర్' కు పన్ను మినహాయింపు దక్కనుందా?
నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ - నటిస్తున్న ఆయన తండ్రి బయోపిక్ ‘ఎన్టీఆర్’ విడుదలకు సర్వం సిద్దం అయ్యింది. సంక్రాంతికి మూవీ విడుదల కాబోతున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను ఈనెల 21న హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బిజినెస్ చేసిన ఈ చిత్రంకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వబోతుందా అంటూ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.
గతంలో బాలకృష్ణ - క్రిష్ ల కాంబినేషన్ లో రూపొందిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రానికి పన్ను మినహాయింపు దక్కిన విషయం తెల్సిందే. పన్ను మినహాయింపు వల్ల నిర్మాతలతో పాటు - డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు దక్కాయి. ఇక ఎన్టీఆర్ మూవీకి ఏపీలో ఖచ్చితంగా పన్ను మినహాయింపు ఉంటుందని కొందరు సినీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఉన్నది తెలుగు దేశం పార్టీ కనుక - చంద్రబాబు నాయుడు పూర్తి సహకారంతోనే ‘ఎన్టీఆర్’ మూవీ తెరకెక్కుతుంది కనుక ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడం పక్కా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో గౌతమి పుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ‘ఎన్టీఆర్’ కు పన్ను మినహాయింపు ఇస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఎన్టీఆర్’ మూవీకి పన్ను మినహాయింపు ఇస్తే రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’కు కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశం ఉండదని - దాంతో విమర్శలు మూట కట్టుకోవాల్సి ఉంటుందని కొందరు అంటున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వకుంటే నందమూరి ఫ్యాన్స్ చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంది. పూర్తి కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ మూవీ పన్ను మినహాయింపు ఇవ్వనవసరం లేదని కొందరు భావిస్తున్నారు. మొత్తానికి ‘ఎన్టీఆర్’ మూవీకి పన్ను మినహాయింపు వస్తుందా లేదా అనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.