అన్ లాక్ 5.0 మీటింగ్.. థియేటర్లు తెరవాలా వద్దా?
కరోనా మహమ్మారీ చాలా ఇండస్ట్రీలతో పాటు సినీపరిశ్రమల దిశానిర్ధేశనాన్ని శాసిస్తోంది. సినిమావాళ్లు ఎప్పుడెలాంటి జాగ్రత్తలు పాటించాలో కూడా అవగతమయ్యేలా చేసింది. ఐదారు నెలలుగా అసలు థియేటర్లు తెరుచుకోకపోవడంతో పూర్తిగా సంక్లిష్ఠ పరిస్థితి నెలకొంది. థియేటర్ వెనకబడితే ఓటీటీ-బుల్లితెరకు ఆదరణ పెరిగింది ఈ సీజన్ లో. అయితే ఎగ్జిబిషన్ రంగం బౌన్స్ బ్యాక్ అవ్వడం ఎలా?
దీనిపైనే అన్ లాక్ 5.0లో చర్చిస్తారట. ఇందుకోసం సినీ రంగానికి చెందిన ప్రముఖులతో ఈ నెల 8న కేంద్ర హోంశాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్సింగ్ చేస్తారట. ఈ సమావేశంలో థియేటర్లు- మల్టీఫ్లెక్స్ ల భవితవ్యంపై చర్చిస్తారట. అసలు థియేటర్లు ఓపెన్ చేయాలా వద్దా? ఓపెన్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? విధివిధానాలేమిటి? అన్నదాని పై వీడియో సమావేశం జరగనుంది.
థియేటర్లు తెరవాల్సిన తేదీ పైనా క్లారిటీ ఇవ్వనున్నారట. థియేటర్లు తెరుచుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనున్నారని తెలిసింది. అయినా ఇప్పుడు థియేటర్ల రంగానికి కావాల్సినది ఓపెన్ చేయడం కాదు.. సర్వైవ్ కావడానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు. పన్నులు ఎత్తేసి టిక్కెట్టు ధరల్ని భారీగా తగ్గించి ఆదుకోవాలి. అలాగే థియేటర్ మెయింటెనెన్స్ కి కూడా ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందించాలి. అప్పుడే ఈ రంగం కొన్నాళ్ల పాటు అయినా మనుగడ సాగించగలిగేది! అన్న వాదనా ఎగ్జిబిటర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.