CBFC వెయ్యి పైగా కోతలు అర్థం చేసుకుంటేనే మేలు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)లో కోతలు తీవ్రతరంగా మారాయి. ప్రాంతీయ బోర్డుల నుంచి సీబీఎఫ్ సీకి చేరాక ఈ కోతలు పెరగడం విస్మయం కలిగిస్తోందని టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాత వెల్లడించారు. ఎలాంటి విషయాల్లో ఈ కోతలు పెడుతున్నారు? అన్నది ఆరా తీస్తే .. దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బ తినకుండా కొన్ని పదాలకు కోత వేస్తున్నారు.
మతపరమైన వివాదాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కులమతాలపై వివాదాస్పద అంశాలను బ్లర్ చేయడం లేదా కోత పెట్టడానికి వెనకాడడం లేదు. అంతర్జాతీయ సంబంధాలు .. మతం .. రాజకీయాలు .. పోలీసుల వగైరా టాపిక్స్ ఏవైనా వివాదాస్పదంగా ఉంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కట్స్ చెబుతోంది. లైంగిక కంటెంట్ .. హింస.. దుర్భాషలాడకుండా తగ్గించాలని సీబీఎఫ్ సీ డిమాండ్ చేస్తోంది
ఒక తాజా ఉదాహరణ పరిశీలిస్తే.. 1000 కోట్ల క్లబ్ కి చేరువలో ఉన్న పఠాన్ కి సీబీఎఫ్ సీ కీలక కట్ చెప్పింది. షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ ఆన్-స్క్రీన్ వెర్షన్ విలన్ అనుచరులలో ఒకరిని మాజీ SBU ఏజెంట్ గా పరిచయం చేస్తుంది. SBU లేదా Sluzhba Bespeky Ukrayiny ఉక్రెయిన్ కి చెందిన భద్రతా సేవ అనేది అర్థం.
అయితే సినిమా ఒరిజినల్ ప్రీ-స్క్రీన్ కట్ మాజీ-KGB అంటూ మార్పు చేయాల్సి వచ్చింది. కేజీబీ అనేది మాజీ సోవియట్ యూనియన్ గూఢచారి ఏజెన్సీ.. కోమిటెట్ గోసుదార్ స్టివెంనోయ్ బెజోపాస్నోస్టి మాజీ ఏజెంట్.
ఇలా మార్పు చేయాలని సూచించడానికి సీబీఎఫ్ సీకే కారణం తెలుసు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సినిమాలను విడుదల చేయడానికి ముందే ఈ కట్ లు సవరణలు చేయాలని ఆదేశించింది. పబ్లిక్ కి ప్రదర్శించే ముందు ఈ మార్పు చేయాలని చిత్రనిర్మాతలను కోరింది.
వాస్తవానికి గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా పలు భాషల్లో (ఇంగ్లీష్ తో సహా) థియేట్రికల్ విడుదల కోసం క్లియర్ చేసిన 300కి పైగా చిత్రాలపై ఆర్డర్ చేసిన 1000 కట్ లు మార్పుల్లో పఠాన్ కి చెప్పిన కట్ ఒకటి. CBFC తొమ్మిది ప్రాంతీయ కార్యాలయాలలో (ముంబై - చెన్నై) రెండింటి నుండి నవంబర్ 2022 నుండి ఫిబ్రవరి 2023 మొదటి వారం మధ్య కట్ లపై సెన్సార్ బోర్డ్ డేటాను సేకరించగా తెలిసిన విషయాలివని ఆయన తెలిపారు. సినీపరిశ్రమల్లో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుని స్క్రిప్టు దశలోనే జాగ్రత్త పడాలని అర్థం చేసుకోవడానికి ఈ డేటా సహకరిస్తుందని ఆయన అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.