శ్రీమంతుడే కాదు దిల్‌ మంతుడూ అవ్వాలి

Update: 2015-08-31 15:53 GMT
ఊరిని దత్తత తీసుకోవడం, దానిని బాగు చేయడం అంటే ఆషామాషీ కాదు. బోలెడంత పెట్టుబడి పెట్టాలి. మనసా వాచా కర్మణా ఆ పనిని ప్రేమించి చేయాలి. ప్రజల అవసరాల్ని తీర్చే దిల్లుండాలి. దానికి తోడు తరగనంత డబ్బుండాలి. శ్రీమంతుడు అవ్వాలి. దిల్లున్నవాడై ఉండాలి. అప్పుడే అది సాధ్యం.

ఏదో మహేష్‌ దత్తత తీసుకున్నాడని మేము సైతం అంటూ ముందుకొచ్చేస్తే సరిపోదు. శ్రీమంతుడుని ఆదర్శంగా చేసుకుని సినిమా తారలు, రాజకీయనేతలు ఊళ్లను దత్తత తీసుకోవడానికి ముందుకు రావడం మంచి పరిణామమే. మంచు విష్ణు తిరుపతి సమీపంలోని 10 గ్రామాల్ని దత్తత తీసుకుని బాగు చేస్తున్నాడు. మంచినీటి సదుపాయం, ఆడపిల్లల చదువులకు సాయం చేస్తున్నాడు. ఇక శ్రుతిహాసన్‌ తన నేటివ్‌ ప్లేస్‌ తమిళనాడులో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని బాగు చేసేందుకు సిద్ధమవుతున్నానని చెప్పింది. డబ్బు ఉంది. దిల్లు ఉంది కాబట్టే ఈ ఇద్దరికీ ఇది సాధ్యమైంది.

అయితే దత్తత తీసుకున్నాం అంటూ రోడ్లకు రంగులేసి, శిలాపలకాలు పెట్టేసుకుంటే సరిపోదు. ఊరిలో ఏ సమస్య ఉన్నా వినాలి. అది పరిష్కారం అయ్యే వరకూ కృషి చేయాలి. దానికి డబ్బును విరివిగా ఖర్చు చేయాల్సిందే. మాట మార్చి మొహం చాటేస్తామంటే కుదరదు. వింటున్నారా శ్రీమంతులూ?
Tags:    

Similar News