దేశ ప్రజల ఊపిరుదడానికి ముందుకొస్తున్న సెలబ్రిటీస్..!

Update: 2021-05-09 15:30 GMT
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఆక్సిజన్ అందక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. స్మశానాల వద్ద మృతదేహాలు బారులు తీరుతున్నాయి. కాల్చడానికి కూడా స్థలం దొరకడం లేదు. ఈ కల్లోల పరిస్థితిలో కరోనా బాధితులకు ఆక్సిజన్  అందించడానికి పలు దేశాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. అమెరికా, యూకే, రొమేనియా, ఐర్లాండ్, బ్రిటన్   వంటి దేశాలు భారత్ కు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, వెంటిలేటర్లు, ర్యాపిడ్  టెస్టింగ్ కిట్లు సరఫరా చేస్తున్నాయి. అలాగే దేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు,  స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. ఉదారంగా విరాళాలు అందజేస్తున్నారు.

 సోనూ సూద్ వంటి వాళ్ళు నిరంతరం కరోనా  బాధితులకు సేవలందించడంలో నిమగ్నమయ్యారు.  ఇప్పుడు తాజాగా వైరస్ బారిన పడి ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి సెలబ్రిటీలందరూ కలిసి 'ఐ బ్రీత్ ఫర్ ఇండియా ' అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వర్చువల్ పద్ధతి ద్వారా పెద్ద మొత్తంలో విరాళాలను సేకరిస్తున్నారు.'ఐ బ్రీత్ ఫర్ ఇండియా ' స్వచ్ఛంద కార్యక్రమానికి లారా దత్త, శ్యామ్ వల్లభ్ జీ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.

బాలీవుడ్ ప్రముఖ సినీ నటులు అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, దర్శక నిర్మాత కరణ్ జోహార్, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, అలాగే పలువురు క్రికెటర్లు విరాళాలు సేకరింరించేందుకు నడుంబిగించారు. ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో టాలీవుడ్ కి చెందిన నటులు కూడా పాలుపంచుకుంటున్నారు. హీరో రానా, హీరోయిన్ సమంత ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ చేస్తున్నారు. కరోనా  బాధితులను ఆదుకోవడానికి విరాళాలు సేకరిస్తూ తమ వంతు కృషి చేస్తున్నారు.
Tags:    

Similar News