మారుతి మీద రాజా సాబ్ ప్రెజర్..?

రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీస్తూ కూడా డైరెక్టర్ కి టెన్షన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ తో సినిమా తీసే టైంలో ఎక్స్ పెక్టెషన్స్ కి రీచ్ అవ్వాలంటే ఆ మాత్రం టెన్షన్ జాగ్రత్త ఉంటుంది కదా.;

Update: 2025-12-11 05:56 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీస్తూ కూడా డైరెక్టర్ కి టెన్షన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ తో సినిమా తీసే టైంలో ఎక్స్ పెక్టెషన్స్ కి రీచ్ అవ్వాలంటే ఆ మాత్రం టెన్షన్ జాగ్రత్త ఉంటుంది కదా. ఐతే ఆ ప్రెజర్ తో ఆయన కనిపించడం ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అంటే రాజా సాబ్ మేకర్ మారుతి అని తెలుస్తుంది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ లాక్ అయ్యింది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది.

రెబల్ ఫ్యాన్స్ కాస్త నెగిటివ్ కామెంట్స్..

ఐతే రాజా సాబ్ సినిమా విషయంలో మారుతి మీద ఇన్షియల్ గా రెబల్ ఫ్యాన్స్ కాస్త నెగిటివ్ కామెంట్స్ చేశారు. దానికి మారుతి బాగా హర్ట్ అయినట్టు ఉన్నాడు. అందుకే వెయిట్ లిఫ్టింగ్ లో ప్రగతి సాధించిన విజయాన్ని గుర్తు చేస్తూ మీరంత ట్రోల్ చేస్తే మేమంత పని చేస్తాం అన్నట్టుగా చెప్పాడు. అంటే రాజా సాబ్ పై తనకున్న ప్రెజర్ ని చూచాయగా చెప్పేశాడు మారుతి.

మారుతి సినిమా అంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అనే టాక్ ఉంది. మొదట్లో కాస్త యూత్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయాలని ఏవో ప్రయత్నాలు చేశాడు కానీ తర్వాత మంచి ఎంటర్టైనర్స్ తీస్తూ వచ్చాడు. ఐతే వెంకటేష్ లాంటి స్టార్ తో సినిమా తీసిన మారుతి మళ్లీ యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఫైనల్ గా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ ఛాన్స్ రాగానే చాలా ఎగ్జైట్ అయ్యాడు.

స్టార్ సినిమాలు రిలీజ్ ముందు రోజు ట్విస్ట్..

ఐతే మారుతితో ప్రభాస్ సినిమాను ఫ్యాన్స్ మాత్రం అసలు ఒప్పుకోలేదు. అందుకే సినిమా సైలెంట్ గా షూట్ స్టార్ట్ చేసి టీజర్ వదిలారు. ఆఫ్టర్ టీజర్ రిలీజ్ రాజా సాబ్ పై రెబల్ ఫ్యాన్స్ గురి కుదిరింది. అయినా సరే రాజా సాబ్ రిలీజ్ వరకు మారుతి ఆ ప్రెజర్ ని మెయింటైన్ చేసేలా ఉన్నాడు. ఎందుకంటే ఈమధ్య స్టార్ సినిమాలు రిలీజ్ ముందు రోజు వరకు ట్విస్ట్ లు తీసుకుంటున్నాయి. అందుకే సంక్రాంతి రిలీజ్ తర్వాత మారుతి సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

రాజా సాబ్ ట్రైలర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు మారుతి. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ అయ్యేలా ఉంది. ఈసారి సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ ఉండగా ప్రభాస్ రాజా సాబ్ మీద ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో రాజా సాబ్ క్రేజ్ బాగుంది. సినిమాతో మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరే ఛాన్స్ ఉందని ఆడియన్స్ నమ్ముతున్నారు.



Tags:    

Similar News