సూర్య సినిమా సమ్మర్ కి షిఫ్ట్..?

కోలీవుడ్ స్టార్ సూర్య ఆర్ జె.బాలాజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కరుప్పు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అసలైతే లాస్ట్ దసరాకే రిలీజ్ అనుకున్నారు కానీ సినిమాను రిలీజ్ చేయలేదు.;

Update: 2025-12-11 06:18 GMT

కోలీవుడ్ స్టార్ సూర్య ఆర్ జె.బాలాజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కరుప్పు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అసలైతే లాస్ట్ దసరాకే రిలీజ్ అనుకున్నారు కానీ సినిమాను రిలీజ్ చేయలేదు. అక్టోబర్ మిస్సైనా నవంబర్, డిసెంబర్ లో రిలీజ్ ఉంటుందని అనుకోగా తమ్ముడి సినిమా వా వాతియార్ ఉందని సూర్య తన సినిమా రిలీజ్ చేయలేదు. చూస్తుంటే సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి వాయిదా పడినట్టే అని తెలుస్తుంది. కరుప్పు సినిమాలో సూర్య చాలా రోజుల తర్వాత ఒక మాస్ రోల్ చేశారు.

మాస్ యాంగిల్ లో సూర్యని చూడాలని..

ఆర్జే బాలాజీ తన డైరెక్షన్ లో చేస్తున్న మాస్ అటెంప్ట్ గా కరుప్పు వస్తుంది. సూర్యని మాస్ యాంగిల్ లో చూడాలని అనుకునే ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా నచ్చేస్తుందని అంటున్నారు. ఐతే సినిమాపై మంచి బజ్ ఉన్నా కూడా రిలీజ్ విషయంలో ఏర్పడుతున్న ఈ కన్ ఫ్యూజన్ సినిమా మీద ఏర్పడ్డ బజ్ తగ్గిస్తుంది. రిలీజ్ ఎప్పుడన్నది క్లారిటీ లేకుండా ఉండటం వల్ల ఫ్యాన్స్ లో ఆసక్తి తగ్గుతుంది.

కరుప్పు సినిమా సూర్య నుంచి రాబోతున్న క్రేజీ మాస్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్య తన వింటేజ్ స్టైల్ లుక్ అండ్ యాక్టింగ్ తో అదరగొట్టేస్తారని అంటున్నారు. ఈమధ్య స్టార్స్ ని తమ వింటేజ్ లుక్ తో చూపించి ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందిస్తున్నారు. సో ఇప్పుడు అదే తరహాలో సూర్య కూడా కరుప్పుతో తన ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న మమితా..

ఈ సినిమా తర్వాత తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు సూర్య. ఆ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సూర్య వెంకీ అట్లూరి కాంబినేషన్ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న మమితా ఈసారి తెలుగు స్ట్రైట్ సినిమాతో ఆకట్టుకునేలా ఉంది. సూర్య కరుప్పు సమ్మర్ కి వాయిదా పడితే వెంకీ అట్లూరి సినిమా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో వస్తుంది. సార్, లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ అందుకున్న వెంకీ ఈసారి సూర్యతో ఎలాంటి సినిమాతో వస్తాడా అన్న ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో ఉంది.

కరుప్పు సినిమా ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఉన్నా కూడా థియేట్రికల్ రన్ బిజినెస్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తుంది. సినిమాపై మాత్రం మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆర్జే బాలీజి డైరెక్టర్ గా ఒక స్టార్ తో చేసిన కరుప్పు డైరెక్టర్ గా అతని గ్రాఫ్ పెంచేలా చేస్తుందని నమ్ముతున్నారు. కరుప్పు, వెంకీ అట్లూరి డైరెక్షన్ సినిమా ఈ రెండు సినిమాలతో సూర్య నెక్స్ట్ ఇయర్ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయనున్నాడు.

Tags:    

Similar News