డిసెంబర్ బాక్సాఫీస్.. మళ్ళీ అదే రిపీట్ అయ్యేనా?

లేట్ గా వస్తుంది.. కానీ లేటెస్ట్ గానే వస్తుంది అన్నట్లు ఏటా వచ్చే డిసెంబర్ నెల... ఏడాదిలో చిట్టచివరిది.;

Update: 2025-12-11 06:09 GMT

లేట్ గా వస్తుంది.. కానీ లేటెస్ట్ గానే వస్తుంది అన్నట్లు ఏటా వచ్చే డిసెంబర్ నెల... ఏడాదిలో చిట్టచివరిది. కానీ అదే నెల ఇప్పుడు టాలీవుడ్ లో బెస్ట్ సీజన్స్ లో ఒకటిగా నిలిచింది. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా.. కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి డిసెంబర్ నెల.. బెస్ట్ ప్రాఫిట్స్ ఇచ్చే సీజన్ గా మారిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఐదేళ్లుగా డిసెంబర్ మంత్ లో కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అయినా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి దక్కుతుంది. అది కూడా మామూలు బ్లాక్ బస్టర్ హిట్ కాదు.. పెద్ద ఎత్తున వసూళ్ల వర్షం కురుస్తుంది. మేకర్స్ కు లాభాల పంట పండిస్తోంది. మరి ఈ ఏడాది కూడా డిసెంబర్ నెల వచ్చేసింది. ఇప్పటికే సగం నెల కూడా కంప్లీట్ అయిపోతుంది.

ఇప్పుడు డిసెంబర్ సెంటిమెంట్ ను రిపీట్ చేసేందుకు నటసింహం బాలయ్య అఖండ 2: ది తాండవం రెడీ అవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఆ సినిమా ప్రీమియర్స్ మరికొన్ని గంటల్లో పడనున్నాయి. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 12వ తేదీన.. అంటే రేపే విడుదల కానుంది. ప్రస్తుతం ప్రీ బుకింగ్ సేల్స్ ఫుల్ జోష్ లో జరుగుతున్నాయి.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. డిసెంబర్ హిట్ రికార్డును కంటిన్యూ చేస్తుందని కూడా నిర్ణయించుకున్నారు. ప్రీమియర్స్ తో పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అయితే కోవిడ్ తర్వాత 2021 డిసెంబర్ లో వచ్చిన అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్ తో పాటు బాలయ్య అఖండ సినిమాలు ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరించాయి. బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్లు సాధించాయి. ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. కానీ ఆ తర్వాత ఏడాది డిసెంబర్ లో అనుకున్న స్థాయిలో సినిమాలు సందడి చేయలేదు.

ఇక 2023 డిసెంబర్ లో ప్రభాస్ సలార్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గత ఏడాది పుష్ప 2: ది రూల్ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి అదరగొట్టింది. ఇప్పుడు అఖండ-2 మరికొన్ని గంటల్లో సందడి చేయనుంది. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News