మొన్న పూజా హెగ్డే..నేడు రుక్మిణీ.. సర్ప్రైజ్ అదుర్స్!

ముఖ్యంగా ముంబై వంటి ప్రదేశాలలో సెలబ్రిటీలకు ప్రత్యేకంగా పాపరాజీలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.;

Update: 2025-12-11 06:26 GMT

ముఖ్యంగా ముంబై వంటి ప్రదేశాలలో సెలబ్రిటీలకు ప్రత్యేకంగా పాపరాజీలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ ప్రియమణి ఈ పాపరాజీల గురించి అసలు విషయాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా హైదరాబాద్ , బెంగుళూరు వంటి ఎయిర్ పోర్ట్ లలో సెలబ్రిటీలు కనిపిస్తే ఫోటోగ్రాఫర్లు ఎగబడి మరీ వారిని ఫోటో తీసే అంత దృశ్యాలు ఎక్కడ కనిపించవు. అదే ముంబైలో చూస్తే పబ్లిక్ లో సెలబ్రిటీలు కనిపించారంటే చాలు వారి వెంటపడి మరీ ఫోటోలను తీస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే మాత్రం అబ్బా ఈ సెలబ్రిటీలకు ఇంత క్రేజ్ ఉందా అని కొంతమంది కామెంట్లు చేస్తే.. మరికొంతమంది ఈ ఫోటోగ్రాఫర్లు ఎందుకు సెలబ్రిటీలను అంతగా ఇబ్బందులు పెడుతున్నారు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. అయితే ఈ పాపరాజీలను ఆయా సెలబ్రిటీలు డబ్బులు ఇచ్చి మరీ నియమించుకుంటారనే విషయాన్ని ప్రియమణి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇదిలా ఉండగా ఈ పాపరాజీలు ఇప్పుడు మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడానికి అలాగే సెలబ్రిటీలకు ఊహించని సర్ప్రైజ్లను అందిస్తూ మరొకసారి వార్తల్లో నిరుస్తున్నారు. అందులో భాగంగానే మొన్నా మధ్య పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ముంబై ఎయిర్పోర్ట్లో ఆమెకు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చి ముందస్తుగానే ఆమె పుట్టిన రోజు వేడుకలను జరిపారు.అలా పాపరాజీలు ఇచ్చిన సర్ప్రైజ్ కి పూజా హెగ్డే ఉప్పొంగిపోయి వారి ముందే కేక్ కట్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఇప్పుడు ఈమె లాగే మరో హీరోయిన్ కి కూడా పాపరాజీలు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు..

ఆమె ఎవరో కాదు రుక్మిణీ వసంత్. ఇటీవల కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ వన్ సినిమాలో యువరాణి పాత్రలో నటించి తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా నిన్న రుక్మిణి వసంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ముంబైలోని బాంద్రాలో కొంతమంది పాపరాజీలు ఈమె చేత కేక్ కట్ చేయించి ఈమెను సర్ప్రైజ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏది ఏమైనా ఇలా పాపరాజీలు సెలబ్రిటీలకు వారి పుట్టినరోజులు సందర్భంగా ఎక్కడ కనిపిస్తే అక్కడ వారి చేత కేక్ కట్ చేయించి వారికి మరింత క్రేజ్ అందేలా చేస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే మొన్న పూజా హెగ్డే నిన్న రుక్మిణి వసంత్.. ఇక మునుముందు ఏ హీరోయిన్స్ చేత ఇలా పబ్లిక్ లో కేక్ కట్ చేయిస్తారో చూడాలి అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

రుక్మిణి వసంత్ విషయానికి వస్తే.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన మధరాసి సినిమాలో కూడా హీరోయిన్గా చేసింది. అయితే ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. కానీ కాంతార చాప్టర్ వన్ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీ తో మరెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.



Tags:    

Similar News