'అవతార్ -3' అంతా చప్పగానే!
`అవతార్ -2`: `ది వే ఆఫ్ వాటర్` రిలీజ్ సమయంలో భారతీయ మీడియాలో ఏ రేంజ్ లో ప్రచారం జరిగిందో తెలిసిందే.;
`అవతార్ -2`: `ది వే ఆఫ్ వాటర్` రిలీజ్ సమయంలో భారతీయ మీడియాలో ఏ రేంజ్ లో ప్రచారం జరిగిందో తెలిసిందే. ప్రత్యే కించి తెలుగు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది `అవతార్` మొదటి భాగం భారీ విజయం సాధించ డంతో? `అవతార్ 2` రిలీజ్ పై నిరంతరం మీడియా ప్రత్యేక కథనాలు వడ్డి వార్చేది. అందుకు తగ్గట్టు దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇండియాన్ మార్కెట్ గురించి మాట్లాడినా? అంశాలు నెట్టింట హైప్ క్రియేట్ చేసేవి. వెరసీ ఇవన్నీ `అవతార్ 2` ప్రచార పరంగా ఆకాశంలో కూర్చబెట్టాయి.
రెండు నెలల్లో సినిమా రిలీజ్ అవుతుందంటే? అంతకంతకు భారతీయ మీడియాలో హైప్ క్రియేట్ అయింది. కానీ `అవతార్ 3` రిలీజ్ విషయలో ఆ సన్నివేశం ఎక్కడా కనిపించలేదు. రిలీజ్ కు ఇంకా వారం రోజులే సమయం ఉన్నా? ఎలాంటి హైప్ కనిపించడం లేదు. తెలుగు మీడియా కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. సాధారణంగా ఏ భాష మీడియా పట్టించుకున్నా? పట్టించుకోకపోయినా? టాలీవుడ్ మీడియా మాత్రం ఓ రేంజ్ లో అవతార్ 2 కి హైప్ ఇచ్చింది. హైదరాబాద్ లో ప్రసాద్ ఐమ్యాక్స్ ఫార్మెట్ లో సినిమా రిలీజ్ అవ్వడం కూడా ఇందకు ఎంతో కలిసొచ్చింది.
`అవతార్` మొదటి భాగం ఐమ్యాక్స్ లో ఏకంగా ఏడాది పాటు ఆడింది. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇదొక రికార్డు. ఏ భాషలోనూ అవతార్ ఏడాది పాటు ఆడలేదు. ఆ రకంగా అవతార్ అంటే తెలుగు నాట ఓ బ్రాండ్ గా ముద్ర పడింది. ఈ సన్ని వేశం కూడా `అవతార్ 2` ప్రచారానికి ఎంతో దోహద పడింది. కానీ `అవతార్ 3` : ` ఫైర్ అండ్ యాష్` విషయంలో ప్రచారం లేకపోవడంతో బజ్ కూడా కనిపించలేదు. డిసెంబర్ 19న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. భారతీయ భాషల న్నింటిలో కూడా రిలీజ్ అవుతుంది. కానీ ఎలాంటి ప్రచారం లేకపోవడంతో సన్నివేశం అంతా చప్పగా కనిపిస్తోంది.
`అవతార్` కు వచ్చినంత హైప్ రెండవ భాగానికి తెలుగు ఆడియన్స్ నుంచి పెద్దగా రాలేదు. ఈ కారణంగానూ `అవతార్ 3`పై కొంత ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 20 త్ సెంచరీ స్టూడియోస్ పంపిణీ చేస్తోంది. మరి దాని అనుబంధం సంస్థలు ఈ వారం రోజులైనా ప్రచార కార్యక్ర మాలు నిర్వహిస్తారా? నేరుగా థియేటర్లోకే వస్తారా? అన్నది చూడాలి. అడ్వాన్స్ బుకింగ్స్ లో మాత్రం జోరు కనిపిస్తోంది.