హీరో రవితేజ తల్లిపై కేసు నమోదు..!

Update: 2022-01-22 06:49 GMT
టాలీవుడ్‌ హీరో రవితేజ తల్లిపై కేసు నమోదు అయిందనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పుష్కర కాలువను ధ్వంసం చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు ఫైల్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మి మరియు మర్రిపాకకు చెందిన సంజయ్‌ లపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

భూపతి రాజ్యలక్ష్మితో పాటు సంజయ్‌ లు సర్వే నంబర్ 108 మరియు 124లో పుష్కర కాలువ - స్లూయిజ్ నిర్మాణ పనులను ధ్వంసం చేశారంటూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News